AMMA
NEWS
NETWORK

మా ఈ పేపర్ చదవండి :  

తాండ్ర వినోద్ రావు సమక్షంలో సొంతగూటికి కీలక నేత

బీజేపీ ఖమ్మం పార్లమెంట్ అభ్యర్థి తాండ్ర వినోద్ రావు సమక్షంలో రుద్ర ప్రదీప్ సొంత గూటికి చేరుకున్నారు. బీఆర్ఎస్‌కు గుడ్ బై చెప్పి కషాయ తీర్థం పుచ్చుకున్నారు. శుక్రవారం ఖమ్మం నగరంలోని చర్చి కాంపౌండ్ నుంచి పార్టీ అభ్యర్థి ఎన్నికల ప్రచారం ప్రారంభించారు. ఈ సందర్భంగా భారీ రోడ్ షో నిర్వహించారు. ఈ కార్యక్రమం ప్రారంభించడానికి ముందు ప్రదీప్‌కు తాండ్ర వినోద్ రావు కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. ప్రదీప్‌లో పాటు 24 డివిజన్ కు చెందిన పలువురు కార్యకర్తలు బీజేపీలో చేరారు. ఈ కార్యక్రమంలో పార్టీ నేతలు కొండపల్లి శ్రీధర్ రెడ్డి, డాక్టర్ గోంగూర వెంకటేశ్వర్లు, అల్లిక అంజయ్య, డాక్టర్ శీలం పాపారావు, మోత్కూరి నారాయణరావు తదితరులు పాల్గొన్నారు.

ANN TOP 10