AMMA
NEWS
NETWORK

మా ఈ పేపర్ చదవండి :  

బీజేపీకి వారి ఓట్లు అడిగే హక్కు లేదు.. ఎందుకంటే: మంత్రి పొన్నం

రిజర్వేషన్లకు సంబంధించి బీజేపీ మొసలి కన్నీరు కారుస్తుందని మంత్రి పొన్నం ప్రభాకర్ విమర్శించారు. తాను అడిగే ప్రశ్నలకు సమాధానం చెప్పాలని బీజేపీ స్టేట్ చీఫ్ కిషన్ రెడ్డి, జాతీయ కార్యదర్శి బండి సంజయ్‌కు సవాల్ విసిరారు. ఈ మేరకు వారికి బహిరంగ లేఖ రాశారు మంత్రి పొన్నం ప్రభాకర్. రిజర్వేషన్‌లకు వ్యతిరేకంగా ఉండే మీ పార్టి బీసీ, ఎస్సీ, ఎస్టీల ఓట్లు అడిగేహక్కు బీజేపీకి లేదన్నారు. 1986లో రాజీవ్ గాంధీ, వీపీ సింగ్‌ల ఆధ్వర్యంలో మురళీధర్ రావు కమిషన్ ఈబీసీ రిజర్వేషన్లు అమలుకు సంబంధించినప్పటి నుండి వ్యతిరేకస్తందన్నారు. రిజర్వేషన్లను రద్దు చేయడానికి కుట్ర చేస్తుందని అన్నారు. తాము మండల కమిషన్ అమలు చేయాలని నిర్ణయం తీసుకుంటే దేశ వ్యాప్తంగా కమండల యాత్ర పెట్టీ మండల కమిషన్ అమలును వ్యతిరేకించింది బీజేపీ కాదా ప్రశ్నించారు. ఆర్ఎస్ఎస్ చీఫ్ మోహన్ భగవత్ రిజర్వేషన్ రహిత భారతదేశాన్ని చేస్తామని అనేక సందర్భాల్లో చెప్పిన మాట వాస్తవం కాదా.. కాంగ్రెస్ పార్టీ దేశ వ్యాప్తంగా కుల గణన సర్వే జరపాలని ఎవరికెంతో – వారికంత అనే నినాదిస్తే ప్రభుత్వం తరుపున కుల గణన సర్వేకి సుప్రీం కోర్టులో అఫిడవిట్ ఇచ్చిన మాట వాస్తవం కాదా.. రిజర్వేషన్లు పెంచిన బీహార్ ప్రభుత్వాన్ని 60 రోజుల్లోనే కూల దోసింది బీజేపీ ప్రభుత్వం కాదా.. బీహార్ లో 50-65 శాతానికి రిజర్వేషన్లు పెంచి ఎస్సీ , ఎస్టీ, ఓబీసీ, ఈబీసీలకు ఇచ్చింది దీనిని తట్టుకోలేక జేడీయూ, ఆర్జేడీ, కాంగ్రెస్, వామపక్షాల ప్రభుత్వాన్ని కూల్చి అస్థిరపర్చలేదా.. ప్రశ్నలు కురిపించారు.

జేపీ నడ్డా సమానత్వం కోరుకునే వాళ్ళంతా నక్సలైట్లు అంటున్నారని, అంటే ఎస్సీ , ఎస్టీ, ఓబీసీలు సమానత్వం కోరుకుంటే నక్సలైట్లు అవుతారా.. ఇది రాజ్యాంగంపై దాడి కాదా నిలదీశారు. సీవిల్ సర్వీస్‌లకు సంబంధించి గత 5 సంవత్సరాలుగా ఎస్సీ, ఎస్టీ, ఓబీసీ లకు అన్యాయం జరుగుతున్న మాట వాస్తవం కాద అని అడిగారు. దేశ సంపద అంతా ఎల్ఐసీ, బీఎస్ఎన్ఎల్, ఎయిర్పోర్ట్ లు, పోర్టులు, జాతీయ రహదారులు అదానీ, అంబానీ లకు అప్పగించి గతంలో ఎప్పుడూ లేని విధంగా మీ హయంలోనే రూ. 150 లక్షల కోట్ల అప్పు తీసుకొచ్చి దేశాన్ని ఆర్థిక ఇబ్బందులు తీసుకొచ్చింది మీరు కాదా.. ఇప్పుడు ఎన్నికలు రాగానే ఉపర్ జై శ్రీరాం.. అందర్ రిజర్వేషన్ కు రాం రాం అంటున్నారని మండిపడ్డారు. మీరు ఎప్పుడూ పేద దళిత వర్గాలకు వ్యతిరేకంగా పని చేస్తారని, తెలంగాణలో గత ఎన్నికల్లో బలహీన వర్గాల నుండి ముఖ్యమంత్రి నీ చేస్తామని చెప్పి.. కనీసం శాసనసభ పక్ష పదవి కూడా బీసీలకు ఎందుకు ఇవ్వలేదని అన్నారు. తెలంగాణ ప్రజల ఆకాంక్షలకు అనుగుణంగా కాంగ్రెస్ పార్టీ పనిచేస్తుందని చెప్పారు. తెలంగాణలో కుల గణన చేపట్టాం.. అసెంబ్లీలో తీర్మానం కూడా చేశాం.. మేము ఎవరెంతో – వారికంత న్యాయం చేస్తామని చెప్పారు. మీరు రాజకీయంగా గుజరాతీలకు తొత్తులుగా, బానిసలుగా పని చేయడం తప్ప తెలంగాణ విభజన హామీలు అమలు చేశారా నిలదీశారు. తెలంగాణ ప్రజలు మీకు ఓటు ఎందుకు వేయాలో నేను అడిగిన ప్రశ్నలకు సమాధానం చెప్పి ఓటు అడగండని మంత్రి పొన్నం ప్రభాకర్ అన్నారు.

ANN TOP 10