AMMA
NEWS
NETWORK

మా ఈ పేపర్ చదవండి :  

లోయలో పడిన కారు.. ఐదుగురు మృతి

ఉత్తరాఖండ్ రాష్ట్రంలో ఘోర రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. ఈ ప్రమాదంలో ఐదుగురు విద్యార్థులు మృతి చెందారు. డెహ్రాడూన్‌లోని పానీవాలా బండ్ వద్ద రోడ్డు పక్కనున్న గుంతలోకి ఓ కారు తీసుకెళ్లింది. అక్కడికక్కడే ఐదుగురు మృతి చెందగా.. మరో యువతి తీవ్రంగా గాయపడింది. గమనించిన స్థానికులు అంబులెన్స్‌తో పాటు పోలీసులకు సమాచారం అందించారు. ఘటనాస్థలికి చేరుకున్న పోలీసులు గాయపడిన యువతిని స్థానిక ఆస్పత్రికి తరలించారు. ఆమె పరిస్థితి కూడా విషమంగా ఉన్నట్లు వైద్యులు చెప్పినట్లు తెలిపారు. బాధితులంతా డెహ్రాడూన్ లోని ఐఎంఎస్ కళాశాల విద్యార్థులుగా పోలీసులు గుర్తించారు. విహార యాత్ర కోసం ముస్సోరికి వెళ్లినట్లు తెలిపారు. కారు వేగంగా నడపడంతో అదుపు తప్పి గుంతలోకి దూసుకెళ్లినట్లు చెప్పారు. ఈ ప్రమాదంపై కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్లు వివరించారు.

ANN TOP 10