AMMA
NEWS
NETWORK

మా ఈ పేపర్ చదవండి :  

సీఎం రేవంత్‌ను కలిసిన రోహిత్ వేముల తల్లి

ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని రోహిత్ వేముల తల్లి రాధిక వేముల కలిశారు. హెచ్‌సీయూ విద్యార్థి రోహిత్ వేముల కేసును రాష్ష్ర హైకోర్టు క్లోజ్ చేసింది. తనని దళితుడని అవమానించినందుకే ఆత్మహత్య చేసుకున్నట్లు ఆధారాలు లేవని పోలీసులు సమర్పించిన నివేదికను పరిగణనలోకి తీసుకున్న కోర్టు కేసును ముగించింది. 2016లో రోహిత్ వేముల ఆత్మహత్య చేసుకున్నారు. దీనిపై అనేక ఆరోపణలు అప్పట్లో వినిపించాయి. అదే సమయంలో పెద్దయెత్తున నిరసనలు కూడా జరిగాయి. శుక్రవారం తెలంగాణ పోలీసులు రోహిత్ వేముల ఎస్సీ కాదని, ఫేక్ సర్టీఫికేట్ కారణంతోనే ఆత్మహత్య చేసుకొని ఉంటాడని ఈ కేసును క్లోజ్ చేసిన విషయం తెలిసిందే. అయితే రోహిత్ వేముల తల్లి మరోసారి అనుమానం వ్యక్తం చేయకపోవడంతో మరోసారి దర్యాప్తు చేయాలని పోలీసు శాఖ నిర్ణించచింది.

ఈ నేపథ్యంలో రోహిత్ తల్లి రాధిక సీఎం రేవంత్ రెడ్డిని కలిశారు. తన కుమారుడి మరణం కేసులో న్యాయం జరిగేలా చూడాలని ముఖ్యమంత్రికి ఈ సందర్భంగా విజ్ఞప్తి చేశారు. ఈ కేసులో న్యాయం జరిగినప్పుడే తన కొడుకు ఆత్మకు శాంతి కలుగుతుందని అన్నారు. రాధిక విజ్ఞప్తిపై సానుకూలంగా స్పందించిన రేవంత్ రెడ్డి కేసు పునర్విచారణ చేపట్టి న్యాయం జరిగేలా చూస్తామని హామీ ఇచ్చారు. ఇప్పటికే ఈ కేసును రీ ఓపెన్ చేసేందుకు డీజీపీ రవిగుప్తా రంగం సిద్ధం చేస్తున్నారని చెప్పారు. దీంతో ఈ కేసును రీ ఓపెన్ చేసినందుకు రాధిక వేముల సీఎం రేవంత్ రెడ్డి కి కృతజ్ఞతలు తెలిపారు.

ANN TOP 10