AMMA
NEWS
NETWORK

మా ఈ పేపర్ చదవండి :  

పొట్ట నింపని ‘పద్మశ్రీ’.. రోజువారీ కూలీగా కిన్నెర మొగిలయ్య..

పొట్ట కూటి కోసం పాటలు పాడుకుంటూ ఊరూరా తిరిగారాయన. తనకు మాత్రమే సాధ్యమైన కిన్నెర వాయిద్యంతో సంగీత ప్రియులను అలరించారు. తన పాటలను మెచ్చిన సినీ పరిశ్రమ సైతం తనను అక్కున చేర్చుకుంది. పవన్ కల్యాణ్ ‘భీమ్లా నాయక్’ సినిమాలోనూ తన పాట వినిపించింది. మెప్పించింది. తన గాన ప్రతిభకు గుర్తింపుగా ప్రశంసలు, పురస్కారాలు కూడా వచ్చాయి. మరీ ముఖ్యంగా భారత ప్రభుత్వం అత్యంత ప్రతిష్ఠాత్మకంగా ప్రదానం చేసే పద్మశ్రీ అవార్డును ఇచ్చి ఆయనను సత్కరించింది.

దీంతో తన కష్టాలు ఇక మాయమైపోయినట్టేననుకున్నారు. కానీ ఆ ప్రతిష్ఠాత్మక పద్మశ్రీ కనీసం తన పొట్ట కూడా నింపలేదు. దిక్కుతోచని పరిస్థితుల్లో పూట గడవడం కోసం రోజువారీ కూలీగా మారాల్చి వచ్చింది. అవును పద్మశ్రీ అవార్డు గ్రహీత, ప్రముఖ జానపద కళాకారుడు దర్శనం మొగులయ్య రోజువారి కూలీగా మారారు. హైదరాబాద్‌ సమీపంలోని తుర్కయమంజాల్‌లో ఓ నిర్మాణ స్థలంలో పని చేస్తూ కనిపించారు. ఇందుకు సంబంధించిన వీడియాలో సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి. తన నెలవారీ గౌరవ వేతనం ఆగిపోయిందని.. అందుకే పొట్టకూటి కోసం ఇలా కూలీపనులకు వెళ్తున్నట్లు ఆయన దీనంగా చెప్పుకొచ్చారు.

‘గతంలో కేసీఆర్ ప్రభుత్వం నాకు కోటి రూపాయల గ్రాంట్ ను అందించింది. అయితే అవి నా పిల్లల పెళ్లిళ్లతో పాటు స్థలం కొనుక్కోవడానికి సరిపోయాయి. డబ్బులు సరిపోకపోవడంతో కడుతున్న ఇంటిని కూడా మధ్యలో నిలిపివేశాను. నా కుమారులకు ఆరోగ్యం సరిగా లేదు. ముందుల కోసమే నెలకు రూ. ఏడు వేలు ఖర్చు అవుతోంది. గత 2,3 నెలలుగా పెన్షన్ కూడా సరిగా రావడం లేదు. ఇంట్లో పూటగడవటం కోసం పని కోసం చాలా చోట్లు ప్రయత్నించాను. అయితే చాలామంది తనపై సానుభూతి చూపిస్తున్నారు కానీ పని ఇవ్వడం లేదు. అందుకే ఇలా కూలీగా మారను’ అని చెప్పుకొచ్చారు మొగిలయ్య.

ANN TOP 10