AMMA
NEWS
NETWORK

మా ఈ పేపర్ చదవండి :  

బీజేపీకి 400 సీట్లు రావాలి… అందులో హైదరాబాద్ ఉండాలి: పాతబస్తీలో అమిత్ షా ప్రచారం

400 సీట్లతో నరేంద్ర మోదీని మూడోసారి ప్రధానిగా చేద్దామని కేంద్ర హోంమంత్రి అమిత్ షా పిలుపునిచ్చారు. ఈసారి బీజేపీకి 400 సీట్లు దాటడం ఖాయమని… అందులో హైదరాబాద్ కూడా ఉండాలన్నారు. హైదరాబాద్ లోక్ సభ నియోజకవర్గంలో పార్టీ అభ్యర్థి మాధవీలతకు మద్దతుగా నిర్వహించిన ర్యాలీలో అమిత్ షా పాల్గొన్నారు.

లాల్ దర్వాజ అమ్మవారి గుడి నుంచి సుధా టాకీస్ వరకు ర్యాలీ నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ… 40 ఏళ్లుగా హైదరాబాద్‌ను రజాకార్లు ఏలుతున్నారని విమర్శించారు. రజాకార్ల నుంచి హైదరాబాద్‌కు విముక్తి కల్పిద్దామన్నారు.

మాధవీలత మాట్లాడుతూ… ఈసారి మనం హైదరాబాద్‌ను గెలుచుకోవాలన్నారు. భాగ్యలక్ష్మి అమ్మవారి వల్ల, ఉజ్జయిని మహంకాళీ శక్తితో ఈసారి హైదరాబాద్‌లో కమలం పువ్వు వికసిస్తుందని ధీమా వ్యక్తం చేశారు.

ANN TOP 10