AMMA
NEWS
NETWORK

మా ఈ పేపర్ చదవండి :  

జూబ్లీహిల్స్‌లో కారు బీభత్సం.. అదుపు తప్పి ట్రాన్స్‌ఫార్మర్‌ పైకి !!

హైదరాబాద్‌ జూబ్లీహిల్స్‌లో కారు బీభత్సం సృష్టించింది. తృటిలో పెను ప్రమాదం తప్పింది. జూబ్లీహిల్స్ రోడ్ నంబర్ 36లో వేగంగా వచ్చిన బెంజ్ కారు అదుపు తప్పి ట్రాన్స్ ఫారంను ఢీ కొట్టింది. ప్రమాదంలో కారు నుజ్జు నుజ్జు అయ్యింది. ఎయిర్ బ్యాగ్ లు ఓపెన్ కావడంతో కారులో ప్రయాణించే వారికి ఎటువంటి ప్రమాదం జరగలేదు.

యాక్సిడెంట్ ను గమనించిన స్థానికులు పోలీసులకు సమాచారం ఇచ్చారు. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని విచారణ చేపట్టారు. అతి వేగం, మద్యం మత్తు కారణంగానే ప్రమాదం జరిగినట్టు పోలీసులు నిర్ధారించారు. తెల్లవారు జామున నాలుగు గంటలకు ప్రమాదం జరిగినట్టు గుర్తించారు. కారు నడుపుతున్న వ్యక్తి జూబ్లీ హిల్స్‌కు చెందిన వ్యక్తిగా అంచనా వేశారు. కారుకు ముందు, వెనుక కూడా నెంబర్‌ ప్లేట్లు లేకపోవడంతో ఎవరో పెద్దవాళ్లకు చెందినదిగా బావిస్తున్నారు. ప్రమాద సమయంలో కారులో ఇద్దరు వ్యక్తులు ఉన్నట్టు గుర్తించారు. ఘటనపై కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టారు జూబ్లీహిల్స్ పోలీసులు.

ANN TOP 10