మందుబాబులకు హైదరాబాద్ పోలీసులు బ్యాడ్ న్యూస్ అందించారు. ఎల్లుండి ఏప్రిల్ 17న వైన్స్ షాప్స్ మూసివేస్తున్న పోలీసులు తెలిపారు. శ్రీరామ నవమి పండుగ సందర్భంగా జంట నగరాల్లో వైన్ షాప్స్ మూసి వేయాలని హైదరాబాద్ సీపీ శ్రీనివాస్ రెడ్డి ఆదేశించారు. ఈనెల 17న ఉదయం 6 గంటల నుంచి 18వ తేదీ ఉదయం 6 గంటల వరకు వైన్ షాపులు, రెస్టారెంట్లలోని బార్లు సైతం బంద్ చేయాలని స్పష్టం చేశారు. హైదరాబాద్, సికింద్రాబాద్ జంట నగరాల్లో శాంతిభద్రతల దృష్ట్యా ఈ నిర్ణయం తీసుకున్నట్టు చెప్పారు. పోలీస్ ఆదేశాలను ఎవరైనా బేఖాతరు చేసినా.. మద్యం విక్రయించినా కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.
