ఖమ్మంలో ఈసారి రాజకీయ సంచలనం ఖాయమని కాషాయ శ్రేణులు ధీమాగా ఉన్నాయి. ఓ వైపు దేశ వ్యాప్తంగా మోడీ సునామీ, ఖమ్మంలో మచ్చలేని నాయకుడు తాండ్ర వినోద్ రావు అభ్యర్థిగా నిలపడం కలిసివస్తుందని ఆ పార్టీ అధిష్టానం ధీమా వ్యక్తం చేస్తుంది. అనేక సమీకరణలు పరిశీలించిన అనంతరం తాండ్ర వినోద్ రావు అభ్యర్థిత్వానికి బీజేపీ కేంద్ర పార్టీ గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. క్షేత్రస్థాయి ప్రచారంలో వినోద్ రావు దూసుకుపోతున్నారు. గత ఎన్నికల్లో నిజామాబాద్, కరీంనగర్ వంటి ప్రాంతాల్లో సంచలనం సృష్టించిన బీజేపీ ఈ దఫా ఖమ్మంలో సరికొత్త రాజకీయాలకు కేంద్రంగా మారుతుందని బీజేపీ కేంద్ర నాయకత్వం ధీమాగా ఉంది. ఇతర పార్టీలకు చెందిన హేమహేమీలాంటి నాయకులు బీజేపీ టికెట్ ఆశించినా వారిని కాదని మచ్చలేని నాయకుడు తాండ్ర వినోద్ రావుకే పట్టంకట్టింది. మోడీ కమలం ఖమ్మంలో ఖాయం ఎంపీగా వినోద్ రావు తధ్యమని ఆ పార్టీ శ్రేణులు విశ్వాసం ప్రదర్శిస్తున్నాయి. రోజు రోజుకు పార్టీ గ్రాఫ్ పెరుగుతుందని చెబుతున్నారు.
