AMMA
NEWS
NETWORK

మా ఈ పేపర్ చదవండి :  

కవితకు జైలా.. బెయిలా.. కస్టడీనా..!?

లిక్కర్ స్కామ్ కేసులో అరెస్టయిన బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ కుమార్తె, ఎమ్మెల్సీ కవిత ఈడీ కస్టడీ నేటితో ముగియనుంది. ఇవాళ (మంగళవారం) ఉదయం 11 గంటలకే ఈడీ (ED) అధికారులు.. కవితను రౌస్ అవెన్యూ కోర్టులో హాజరుపర్చాల్సి ఉంది. కానీ.. 11 గంటలు దాటినా ఇంతవరకూ కవితను కోర్టుకు తీసుకురాలేదు..

ఈడీ కస్టడీ నేటితో ముగియనుంది. ఇవాళ (మంగళవారం) ఉదయం 11 గంటలకే ఈడీ (ED) అధికారులు.. కవితను రౌస్ అవెన్యూ కోర్టులో(Rouse Avenue Court) హాజరుపర్చాల్సి ఉంది. కానీ.. 11 గంటలు దాటినా ఇంతవరకూ కవితను కోర్టుకు తీసుకురాలేదు. కవితను కోర్టుకు తీసుకొస్తే.. ఏం జరగుబోతోంది..? మళ్లీ కస్టడీకి ఇస్తారా.. లేకుంటే బెయిల్ దక్కుతుందా.. ఈ రెండు కాకుండా తీహార్ జైలుకెళ్లడం ఖాయమా..? అనేదానిపై గల్లీ నుంచి ఢిల్లీ వరకూ సర్వత్రా ఉత్కంఠ నెలకొంది. ఢిల్లీ వర్గాల నుంచి అందుతున్న విశ్వసనీయ వర్గాల సమాచారం మేరకు కవిత కస్టడీని పొడిగించే అవకాశాలు మెండుగా ఉన్నాయి. ఎందుకంటే కవిత, ఢిల్లీ సీఎం కేజ్రీవాల్‌ను ఒకేసారి కలిపి విచారించే యోచనలో ఈడీ అధికారులు ఉన్నట్లు సమాచారం.

మరోవైపు.. రాజకీయ కక్షసాధింపు చర్యలో భాగంగానే తనను అరెస్ట్ చేశారని ఈ నెల 23న రౌస్‌ అవెన్యూ కోర్టులో కవిత బెయిల్‌ పిటిషన్‌ వేసిన సంగతి తెలిసిందే. ఈ నెల 26న విచారిస్తామని న్యాయమూర్తి తెలిపారు. దీంతో ఏం జరుగుతుందో ఏమోనని కవితలో.. ఇటు బీఆర్ఎస్ వర్గాల్లో టెన్షన్ మొదలైంది. అంతా మంచే జరగాలని బీఆర్ఎస్ శ్రేణులు కోరుకుంటున్నాయి.

ANN TOP 10