AMMA
NEWS
NETWORK

మా ఈ పేపర్ చదవండి :  

ఆమెకు 25, అతనికి 55.. పోలీస్ స్టేషన్‌కు వచ్చిన యువతితో ఏఎస్ఐ ఎఫైర్, ఫొటోలు వైరల్..!

ప్రస్తుత సమాజంలో ఎవరిని నమ్మాలో ఎవరిని నమ్మకూడదో అర్థంకాని పరిస్థితులున్నాయి. ఏదైనా అన్యాయం జరిగితే న్యాయం కోసం పోలీస్ స్టేషన్‌కు వెళ్తుంటాం. కానీ.. న్యాయం చేయాల్సిన పోలీసులే.. బాధితుల బలహీనతలను అసరాగా చేసుకుని మోసం చేస్తే.. ఇంకెవ్వరిని నమ్మాలి. అచ్చం అలాంటి ఘటనే జరిగింది.. జగిత్యాల జిల్లా ఇబ్రహీంపట్నం మండలంలో.

వర్షకొండ గ్రామానికి చెందిన 23 ఏళ్ల ఓ వివాహిత భర్త రోజు తాగొచ్చి వేధిస్తున్నాడు. అయితే.. ఆ భర్త పెట్టే వేధింపులు తట్టుకోలేక ఇబ్రహీంపట్నం పోలీస్ స్టేషన్‌కు వెళ్లి.. కంప్లైంట్ చేసింది. ఎలా అయినా తనకు న్యాయం చేయాలంటూ పోలీసులను వేడుకుంది. దీంతో.. విధుల్లో ఉన్న ఏఎస్ఐ ఆ యువతి భర్తను పిలిపించి.. కౌన్సిలింగ్ ఇచ్చాడు. కౌన్సిలింగ్ ఇచ్చినా.. అతనిలో ఏ మార్పు రాకపోవడంతో.. భార్యభర్తల మధ్య గొడవలు జరగటం, ఆమె పోలీస్ స్టేషన్‌కు వచ్చి కంప్లైంట్ ఇవ్వటం.. ఇదే రిపీట్. దీంతో.. తరచూ వస్తున్న ఆ వివాహిత మీద ఏఎస్‌ఐ కన్నేశాడు.

ఆమె భర్త గురించి విచారణ పేరుతో.. తరచూ ఆమెకు ఫోన్లు చేసి మాట్లాడుతూ ఆమెకు మెల్లిగా దగ్గరయ్యాడు. ఇద్దరి మధ్య చనవు కూడా పెరిగింది. ఎంతగా అంటే.. ఇద్దరూ లవర్స్‌ కంటే ఎక్కువ చనువుగా ఉన్న ఫొటోలు తీసుకునేంత. అయితే.. ఎలా బయటికివచ్చాయో కానీ.. ఆ ఫొటోలు బయటపడ్డాయి. ఈ ముచ్చట ఎస్ఐ వరకూ చేరింది. దీంతో.. ఈ విషయాన్ని మెట్‌పల్లి సర్కిల్ ఇన్‌స్పెక్టర్ దృష్టికి తీసుకుని వెళ్లాడు. ఏఎస్ఐను మందలించి వదిలేశాడు. అయితే.. ఆ ఏఎస్ఐ వయసు 53 కావటంతో.. త్వరలోనే రిటైర్మెంట్ ఉందని ప్రాదేయపడటంతో ఎలాంటి చర్యలు తీసుకోలేదు.

ఇక.. యువతితో ఏఎస్ఐ చనువుగా ఉన్న ఫొటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. దీంతో.. ఈ విషయం ఉన్నతాధికారులకు చేరటంతో.. ఎఫైర్‌పై సీరియస్ అవటమే కాకుండా బదిలీ వేటు వేశారు. ఇబ్రహీంపట్నం పోలీస్ స్టేషన్ పనిచేస్తున్న ఏఎస్ఐని హెడ్ క్వార్టర్‌కు అటాచ్ చేస్తూ ఎస్పీ ఉత్తర్వులు జారీ చేశారు.

ANN TOP 10