AMMA
NEWS
NETWORK

మా ఈ పేపర్ చదవండి :  

అవినీతి సర్కార్‌ను దించేయండి.. ఏపీ ప్రజలకు ప్రధాని పిలుపు..!

ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌పై(YS Jagan) ప్రధాని నరేంద్ర మోదీ(PM Modi) తీవ్రస్థాయిలో ఫైర్ అయ్యారు. అవినీతి ప్రభుత్వాన్ని పెకిలించాల్సింది రాష్ట్ర ప్రజలేనని అన్నారు. ఆదివారం చిలకలూరి పేట పరిధిలో జరిగిన ప్రజాగళం సభకు(Prajagalam Sabha) ప్రధాని నరేంద్ర మోదీ హాజరయ్యారు. ఈ సందర్భంగా ప్రసంగించిన ఆయన.. సీఎం జగన్‌పై నిప్పులు చెరిగారు. జగన్ తనకెవరూ అడ్డు లేరని భావిస్తున్నాడని, అవినీతి ప్రభుత్వాన్ని ప్రజలు పడగొట్టాల్సిందేనని పిలుపునిచ్చారు. అవినీతి విషయంలో ఏపీ మంత్రులు పోటీ పడుతున్నారని ప్రధాని ఆరోపించారు. వైసీపీ ప్రభుత్వ అవినీతి వల్లే ఏపీ అభివృద్ధి చెందలేదన్నారు. గత ఐదేళ్లలో ఏపీ అభివృద్ధి కుంటుపడిందన్నారు. ఢిల్లీలో, ఏపీలో ఎన్డీయే ప్రభుత్వాలను అధికారంలోకి తేవాలని ప్రజలకు పిలుపునిచ్చారు ప్రధాని మోదీ. ఏపీ ప్రజలు ఈ ఎన్నికల్లో రెండు సంకల్పాలు తీసుకోవాలని.. ఇందులో మొదటిది ఎన్డీయే సర్కారును మూడోసారి ఏర్పాటు చేయడం, మరోటి ఏపీలో అవినీతి సర్కారుకు చరమగీతం పాడటం అని అన్నారు.

దేశంలో పేదవారి గురించి ఆలోచించే ప్రభుత్వం కేవలం ఎన్డీయే మాత్రమే అనని ప్రధాని మోదీ అన్నారు. కేంద్రంలో ఉన్న ఎన్డీయే ప్రభుత్వం సేవానిరతితో సేవను అందిస్తోందన్నారు. దేశ ప్రజల్లో కోట్లాది మందిని పేదరికం నుంచి బయటపడేశామన్నారు. పీఎంఏవై కింద రాష్ట్రానికి 10 లక్షలు ఇళ్లు ఇస్తే దానిలో 5 వేల ఇళ్లు పల్నాడుకే ఇచ్చామని చెప్పారు ప్రధాని. జల్ జీవన్ మిషన్ కింద ఏపీలో ఎలాంటి డబ్బు తీసుకోకుండా కోటిమందికి నల్లా కనెక్షన్ ఇచ్చామన్నారు.

తెలుగులో స్పీచ్.. తెలుగు నేతలపై ప్రశంసలు..

ప్రధాని నరేంద్ర మోదీ తన ప్రసంగాన్ని తెలుగులో మాట్లాడుతూ ప్రారంభించారు. ‘నా ఆంధ్ర కుటుంబ సభ్యులందరికీ నమస్కారాలు’ అంటూ ప్రారంభించారు. ఇదే సమయంలో సీనియర్ ఎన్టీఆర్, మాజీ ప్రధాని పీవీ నరసింహారావులను స్మరించుకున్నారు. సీనియర్ ఎన్టీఆర్‌పై ప్రశంసలు కురిపించిన ప్రధాని మోదీ.. ఆయన గొప్ప వ్యక్తి అని కీర్తించారు. రాముడి, కృష్ణుడు పాత్రలో జీవించేవారని.. అయోధ్యలో బాల రాముడి ప్రతిష్ట రోజు అదే గుర్తొచ్చిందన్నారు. రైతులు, పేదల కోసం ఎన్టీఆర్ పోరాడారని, ఎన్టీఆర్ శతజయంతి ఉత్సవాల్లో నాణెం విడుదల చేశామని చెప్పారు. దివంగత నేత, మాజీ ప్రధాని పీవీ సేవలను గుర్తించి ఆయనకు భారతరత్న ఇచ్చామన్నారు. పీవీ నరసింహారావును కాంగ్రెస్ అవమానించిందని, ఎన్డీయే ప్రభుత్వం మాత్రం ఆయనను గౌరవించిందన్నారు.

ANN TOP 10