AMMA
NEWS
NETWORK

మా ఈ పేపర్ చదవండి :  

పాయల్ .. సంచలన ఆరోపణలు

బాలీవుడ్‌ దర్శకుడు అనురాగ్‌ కశ్యప్‌పై (Anurag Kashyap)మరోసారి ఆరోపణలు చేసింది నటి పాయల్‌ఘోష్‌ . ‘మీటూ’ ఉద్యమంలో భాగంగా ఆమె నోరు తెరిచారు. అనురాగ్‌ కశ్యప్‌ మంచి వాడు కాదంటూ మూడేళ్ల క్రితం పాయల్‌ఘోష్‌ మొదటిసారి ట్వీట్‌ చేశారు. సినిమాలో అవకాశం ఇస్తానని చెప్పి ఇంటికి పిలిచి.. తనపై అత్యాచారానికి పాల్పడ్డాడని అప్పట్లో ఆమె దుమారం లేపింది. ఆమె వ్యాఖ్యలు బాలీవుడ్‌లో తీవ్ర చర్చకు దారి తీశాయి. అనురాగ్‌ కశ్యప్‌పై తాను పోలీసులకు ఫిర్యాదు చేశానని, కేసు దర్యాప్తు జరుగుతుందని, ఇదంతా డబ్బుతో కూడుకున్న వ్యవహారమని ఆమె తెలిపింది. తాజాగా మరోసారి అనురాగ్‌ కశ్యప్‌పై షాకింగ్‌ కామెంట్స్‌ చేశారామె

‘‘కెరీర్‌ బిగినింగ్‌లో నేను దక్షిణాది చిత్రాల్లో నటించా. జాతీయ పురస్కారాలు అందుకున్న ఇద్దరు దర్శకులతో పని చేశా. ఆ ఇద్దరు నాకెంతో గౌరవం ఇచ్చారు. నన్ను ఇబ్బందిపెట్టేలా ఎప్పుడూ ప్రవర్తించలేదు. బాలీవుడ్‌ విషయానికొస్తే అలాంటి పరిస్థితి లేదు. అనురాగ్‌ కశ్యప్‌తో నేను అస్సలు పనిచేయలేదు. అవకాశం కోసం కలిసినందుకే నాపై లైంగిక దాడికి పాల్పడ్డాడు. అతనితో నేను కలిసిన మూడో మీటింగ్‌లోనే ఇలాంటి పరిస్థితి ఎదురైంది. దక్షిణాది పరిశ్రమలో మంచి వాతావరణం ఉంది. అక్కడ నన్ను ఎవరూ రేప్‌ చేయలేదు. అందుకే ఆ పరిశ్రమ అంటే అంత గౌరవం. కాబట్టి సౌత్‌ ఇండస్ట్రీ గురించి గొప్పగా మాట్లాడతాను’’ అని అన్నారు. అనంతరం జూ.ఎన్టీఆర్‌పై (Jr ntr) తనకున్న అభిమానాన్ని తెలిపారు పాయల్‌. ఆయన ఎంతోమంచి వాడని పేర్కొంది. మంచు మనోజ్‌ ‘ప్రయాణం’ చిత్రంతో తెలుగు ఇండస్ట్రీకి పరిచయమైన పాయల్‌ తదుపరి ఎన్టీఆర్‌ ‘ఊసరవెల్లి’ చిత్రంలో నటించారు.

ANN TOP 10