సికింద్రాబాద్ (Secunderabad) స్వప్నలోక్ కాంప్లెక్స్(Swapnalok Complex) కేసు దర్యాప్తు ముమ్మరంగా కొనసాగుతోంది. స్వప్నలోక్ కాంప్లెక్స్‌ను JNTU నిపుణుల బృందం ప్రొఫెసర్లు డీఎన్ కుమార్(Professors DN Kumar), శ్రీలక్ష్మి (Srilakshmi), ఆదివారం పరిశీలించారు. బిల్డింగ్ నాణ్యత ప్రమాణాలను పరిశీలించినట్లు జేఎన్టీయూ బృందం వెల్లడించింది. స్వప్నలోక్ బిల్డింగ్‌లో నాలుగు, ఐదు, ఆరు అంతస్తులను జేఎన్టీయూ బృందం పరిశీలించిన తర్వాత నాలుగు, ఆరు అంతస్తులలో ప్రమాద తీవ్రత కారణంగా కొంత దెబ్బతిన్నట్లు బృందం తెలిపింది. బీమ్స్, స్లాబ్ పరీక్షలు నిర్వహించిన అనంతరం నివేదిక ఇవ్వనట్లు తెలిపారు. నివేదికను బట్టి భవనాన్ని కూల్చేయాలా లేదా అనే విషయంపై స్పష్టత రానుంది. పరీక్షలు నిర్వహించేందుకు మూడు రోజుల సమయం పట్టే అవకాశం ఉన్నట్లు జేఎన్టీయూ బృందం వెల్లడించింది. అగ్నిప్రమాదంలో దెబ్బతిన్న భవనానికి నాన్ డిస్ట్రక్లివ్ టెస్ట్ నిర్వహణ చేశారు. అయితే..38 ఏళ్ల నాటి నిర్మాణం కావడంతో పలుచోట్ల గోడలు దెబ్బతిన్నట్లు గుర్తించారు.
కాగా, ఇటీవల జరిగిన దక్కన్ మాల్ అగ్నిప్రమాద ఘటన మరువక ముందే సికింద్రాబాద్‌లో మరో అగ్నిప్రమాదం జరగడంతో నగర ప్రజలు ఉలిక్కపడ్డారు. అయితే..జనసంచారం ఎక్కువగా ఉండే స్వప్నలోక్ కాంప్లెక్స్(Swapnalok complex)లో భారీ అగ్నిప్రమాదం (FIRE accident) జరిగింది. ఈ ఘటనలో ఆరుగురు వ్యక్తులు మృతిచెందిన సంగతి తెలిసిందే. మృతుల్లో నలుగురు మహిళలు, ఇద్దరు పురుషులు ఉన్నారు. మృతిచెందిన వారిని ప్రమీల, వెన్నెల, శ్రావణి, త్రివేణి, శివ, ప్రశాంత్‌గా పోలీసులు గుర్తించారు.