హైదరాబాద్: నగరంలోని కాచిగూడ పోలీస్ స్టేషన్ పరిధిలో శనివారం హవాలా డబ్బు పట్టుబడింది. రూ.17 లక్షల నగదును పోలీసులు సీజ్ చేశారు. విశ్వసనీయ సమాచారం మేరకు కాచిగూడలో వాహన తనిఖీలు చేపట్టినట్లు తెలుస్తోంది. హరినారాయణ అనే వ్యక్తి వద్ద లక్షల నగదును పోలీసులు గుర్తించారు. హవాలా సొమ్ము మార్చడానికి వస్తుండగా పట్టుబడినట్లు తెలుసుకున్నారు. నగదును స్వాధీనం చేసుకున్న పోలీసులు ఐటి అధికారులు సమాచారం ఇచ్చారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.