మాజీ మంత్రి, బీజేపీ నేత ఈటల రాజేందర్ హాట్ హాట్ కామెంట్స్ చేశారు. ‘‘ తెలంగాణ గాంధీనని చెప్పుకునే కేసీఆర్ ఖతమయ్యిండు. వారి పార్టీ ఉంటదో పోతదో’’ అని అన్నారు. కేసీఆర్ తన బాగు కోసం.. మోదీ మాత్రం దేశం బాగు కోసం పనిచేస్తారని అన్నారు. యావత్ దేశం నరేంద్ర మోదీ మళ్లీ ప్రధాన మంత్రి కావాలని సంకల్పించిందని అన్నారు. మోదీ వచ్చిన తర్వాత ప్రపంచ దేశాలలో భారతీయులకు గౌరవం పెరిగిందని అన్నారు. మోదీ ప్రభుత్వంలో ఎలాంటి స్కామ్ లేదని అన్నారు. ఇక రేవంత్ రెడ్డి ప్రభుత్వం ఇచ్చిన ఆరు గ్యారెంటీలను పదేళ్లలో కూడా అమలు చేయలేరని ఈటల రాజేందర్ అన్నారు.
