AMMA
NEWS
NETWORK

మా ఈ పేపర్ చదవండి :  

మంత్రి కొండా సురేఖకు డెంగీ

హైదరాబాద్‌ : అటవీ, పర్యావరణ, దేవాదాయ ధర్మాదాయ శాఖ మంత్రి కొండా సురేఖ డెంగీ (Dengue fever)తో బాధపడుతున్నారు. అసెంబ్లీ బడ్జెట్ సమావేశాల్లో పాల్గొంటున్న సమయంలో మంత్రి జ్వరం బారిన పడ్డారు. దీంతో తన మంత్రిత్వశాఖల పరిధిలోని కార్యక్రమాలను ఇంటి నుంచే పర్యవేక్షిస్తూ వస్తున్నారు.

ఐదు రోజులగా జ్వరం తగ్గకపోవడంతో డాక్టర్లు పలు వైద్య పరీక్షలు చేసి డెంగీ పాజిటివ్ గా నిర్ధారించారు. ప్రస్తుతం హైదరాబాద్‌లోని తన నివాసంలో వైద్యుల పర్యవేక్షణలో చికిత్స తీసుకుంటూ, రోజువారి కార్యక్రమాలను మంత్రి పర్యవేక్షిస్తున్నారు. మేడారం జాతర పనుల పురోగతిని, ఏర్పాట్లను అధికారులను అడిగి తెలుసుకున్నారు. అవసరమైన సూచనలు చేశారు. మరో రెండు, మూడు రోజుల్లో కోలుకొని మేడారం సమ్మక్క, సారక్క జాతరలో మంత్రి పాల్గొంటారని వైద్యులు తెలిపారు.

ANN TOP 10