త్వరలో భారీ పరిశ్రమ ఏర్పాటు..
తెలంగాణకు అత్యాధునిక మౌలిక సదుపాయాలతో పాటు, లక్షలాది ఉద్యోగావకాశాలు కల్పించే దిశగా కేంద్రం ప్రభుత్వం అడుగులు వేస్తోంది. ఈ మేరకు తెలంగాణతో సహా పలు రాష్ట్రాలలో టెక్స్‌టైల్ రంగాన్ని పెంచేందుకు పీఎం మిత్ర మెగా టెక్స్‌టైల్ పార్కులను ఏర్పాటు చేయనున్నట్లు ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ తెలియజేశారు. ఈ విషయాన్ని ఆయన స్వయంగా తన ట్విట్టర్ వేదికగా ప్రకటించారు. ఇంకా ఈ పార్కుల ద్వారా టెక్స్‌టైల్స్ రంగానికి అత్యాధునిక మౌలిక సదుపాయాలను కల్పిస్తాయని, కోట్లాది పెట్టుబడులను ఆకర్షిస్తుందని, లక్షలాది మందికి ఉద్యోగావకాశాలు కల్పిస్తాయని ఆయన పేర్కొన్నారు.