AMMA
NEWS
NETWORK

మా ఈ పేపర్ చదవండి :  

పుష్య మాసంలో శుభ కార్యాలా? హిందూ సంప్రదాయాలకు విరుద్ధం: హైకోర్టులో పిల్

ఉత్తరప్రదేశ్‌లోని అయోధ్యలో రామ మందిరం ప్రారంభోత్సవ గడువు సమీపించింది. ఈ నెల 22వ తేదీన ఈ ఆలయాన్ని ప్రారంభించాల్సి ఉంది. ప్రారంభోత్సవ కార్యక్రమానికి ప్రధానమంత్రి నరేంద్ర మోదీ సహా 4,000 వేలమంది ప్రముఖులు హాజరు కానున్నారు. వివిధ దేశాల నుంచి వందమంది ప్రతినిధులు పాల్గొననున్నారు. ఇప్పటికే ఆహ్వాన పత్రికలు అందాయి. పలు రాష్ట్రాల ముఖ్యమంత్రులు, కేంద్ర మంత్రులు, పారిశ్రామికవేత్తలు, బాలీవుడ్ నటీనటులు, సెలెబ్రిటీలకు ఆహ్వానం అందింది. అయోధ్యలో ప్రతి ఇంటికీ రామాలయ ప్రారంభోత్సవ ఆహ్వాన పత్రికలను పంపించింది శ్రీరామ జన్మభూమి తీర్థ క్షేత్ర ట్రస్ట్. ఈ నెల 15వ తేదీ నాడే ప్రారంభోత్సవ కార్యక్రమాలు, ఆచారాల మొదలయ్యాయి. ఆగమోక్తంగా పూజాదికాలను నిర్వహిస్తోన్నారు అర్చకులు. వేదమంత్రోచ్ఛారణలతో అయోధ్యా నగరం మారుమోగిపోతోంది. ఆధ్యాత్మిక వాతావరణం నెలకొంది. దేశం నలుమూలల నుంచి వేలాదిమంది ప్రముఖులు ఇక్కడికి రానుండటంతో భద్రత ఏర్పాట్లు కట్టుదిట్టం అయ్యాయి.

ఒకవంక రామ్ లల్లా విగ్రహానికి ప్రాణప్రతిష్ఠ కార్యక్రమాలు జోరుగా సాగుతుంటే.. మరోవంక దీన్ని అడ్డుకోవాలంటూ న్యాయస్థానంలో పిటీషన్లు దాఖలు కావడం ప్రాధాన్యతను సంతరించుకుంది. ఉత్తరప్రదేశ్‌కే చెందిన భోళా దాస్ అనే వ్యక్తి అలహాబాద్ హైకోర్టును ఆశ్రయించాడు. రామ మందిరం ప్రారంభోత్సవానికి వ్యతిరేకంగా ప్రజా ప్రయోజనాల వ్యాజ్యాన్ని దాఖలు చేశాడు. హిందువుల గుండెల్లో కొలువైన శ్రీరామచంద్రుడి జన్మస్థానంలో మందిర నిర్మాణం జరగడం స్వాగతిస్తోన్నామని, దీన్ని ప్రారంభించడానికి చేపట్టిన ముహూర్తం సరైంది కాదని భోళాదాస్ పిటీషన్‌లో పేర్కొన్నాడు. హిందూ సంప్రదాయం ప్రకారం.. పుష్య మాసంలో ఎలాంటి శుభ కార్యాలను నిర్వహించకూడదని, దీనికి పూర్తి భిన్నంగా రాములవారి ఆలయం నిర్మాణాన్ని ప్రారంభించబోతోండటం సరికాదని అన్నాడు. పైగా ఆలయ నిర్మాణం అసంపూర్తిగా ఉందని, అలాంటి ప్రదేశంలో శ్రీరాముడి విగ్రహానికి ప్రాణ ప్రతిష్ఠం చేయబోతోండటం వల్ల అరిష్ఠం సంభవిస్తుందని అన్నాడు. పూరీ పీఠాధిపతి శంకరాచార్యులు చేసిన వ్యాఖ్యలను తన పిటీషన్‌లో పొందుపరిచాడు. ఈ కార్యక్రమంపై స్టే విధించాలని విజ్ఞప్తి చేశారు.

ANN TOP 10