లోక్‌సభ ఎన్నికలకు సమాయత్తమవుతోన్న కాంగ్రెస్ పార్టీ వివిధ రాష్ట్రాలకు ప్రదేశ్ ఎలక్షన్ కమిటీలను ఏర్పాటు చేసింది. తెలంగాణలో ప్రదేశ్ ఎన్నికల కమిటీ ఛైర్మన్‌గా సీఎం రేవంత్‌రెడ్డిని అధిష్ఠానం నియమించింది. ఆయనతో పాటు మొత్తం 25 మందికి ఎన్నికల కమిటీలో చోటు లభించింది. ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క, మంత్రులు ఉత్తమ్ కుమార్‌రెడ్డి, కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి, డి.శ్రీధర్‌బాబు, సీతక్క, దామోదర రాజనర్సింహ, సీనియర్ నేతలు జానారెడ్డి, వి.హనుమంతరావు, మధుయాష్కీ, సంపత్ కుమార్, రేణుకా చౌదరి, బలరామ్ నాయక్, జగ్గారెడ్డి, గీతారెడ్డి, అజహరుద్దీన్, అంజన్‌కుమార్ యాదవ్, మహేశ్వర్ కుమార్‌గౌడ్, షబ్బీర్ అలీ, ప్రేమ్‌సాగర్‌రావు, పొదెం వీరయ్య, సునీతారావుతో పాటు ఎక్స్‌అఫీషియో సభ్యులుగా యూత్ కాంగ్రెస్, ఎన్‌ఎస్‌యూఐ, సేవాదళ్ రాష్ట్ర అధ్యక్షులకు అవకాశం కల్పించింది.
