AMMA
NEWS
NETWORK

మా ఈ పేపర్ చదవండి :  

తెలంగాణ హైకోర్టు నిర్మాణానికి 100 ఎకరాల కేటాయింపు…

తెలంగాణలో కొత్త హైకోర్టు భవన నిర్మాణానికి రాష్ట్ర ప్రభుత్వం 100 ఎకరాల భూమిని కేటాయిస్తూ శుక్రవారం జీవో విడుదల చేసింది. రంగారెడ్డి జిల్లా రాజేంద్రనగర్‌ మండలం ప్రేమావతిపేట్‌, బుద్వేల్‌ గ్రామ పరిధిలోని 100 ఎకరాలను హైకోర్టు భవన నిర్మాణానికి కేటాయిస్తున్నట్లు జీవో నెంబర్‌ 55లో పేర్కొంది. 1966లో అప్పటి ప్రభుత్వం బుద్వేల్‌లోని 2500 ఎకరాలను వ్యవసాయ, ఉద్యాన విశ్వవిద్యాలయానికి కేటాయించింది. అయితే అదే భూమిలోని 100 ఎకరాలను న్యాయశాఖకు కేటాయించాలని తాజాగా నిర్ణయించినట్లు ప్రభుత్వం జీవోలో వెల్లడించింది.ఈ స్థలంలో కొత్త హైకోర్టు భవన నిర్మాణం జరిగేంతవరకు హైకోర్టు కార్యకలాపాలు అన్నీ పాత భవనంలోనే జరుగుతాయి అని ప్రభుత్వం పేర్కొంది. ఆ తర్వాత దాన్ని వారసత్వ కట్టడంగా కాపాడాలని తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం భావిస్తున్నది. బిఆర్ఎస్ ప్రభుత్వం నియమించిన 33 గ్రంథాలయ సంస్థల ఛైర్మన్లు, సభ్యులను కాంగ్రెస్‌ ప్రభుత్వం తొలగిస్తూ ఉత్తర్వులు జారీ చేసింది.

ANN TOP 10