క్రికెట్ అభిమానులు ఎంతో ఆతృతతో ఎదురుచూస్తున్న టీ20 వరల్డ్ కప్(T20 World Cup 2024) షెడ్యూల్ వచ్చేసింది. అమెరికా(USA), వెస్టిండీస్(West Indies) సంయుక్తంగా ఆతిథ్యమిస్తున్న ఈ మోగా టోర్నీ షెడ్యూల్‌ను ఐసీసీ(ICC) శుక్రవారం విడుదల చేసింది. జూన్ 1వ తేదీన జరిగే ఆరంభ పోరులో కెనడా, యూఏఈ ఢీకొననున్నాయి.
ఒకే గ్రూప్‌లో ఉన్న చిరకాల ప్రత్యర్థులు భారత్, పాకిస్థాన్ జూన్ 9వ తేదీన న్యూయార్క్‌లో తలపడనున్నాయి. వరుసగా జూన్ 26, 27వ తేదీల్లో సెమీ ఫైనల్స్.. బార్బడోస్‌లో జూన్ 29వ తేదీన ఫైనల్ మ్యాచ్ నిర్వహించనున్నారు.
వెస్టిండీస్, అమెరికాలో మొత్తంగా ఐదు స్టేడియాలు టీ20 వరల్డ్ కప్ పోటీలకు ఆతిథ్యమిస్తున్నాయి. బార్బడోస్‌తో పాటు న్యూయార్క్‌లోని ఐసెన్‌హోవర్ పార్క్, ఫ్లోరిడాలోని లాడెర్‌హిల్, టెక్సాస్‌లోని గ్రాండ్ ప్రైరీలు మెగా టోర్నీలో ప్రేక్షకులతో నిండిపోనున్నాయి.
టీమిండియా మ్యాచ్‌లు
గ్రూప్ ఏలో ఉన్న భారత జట్టు నాలుగు లీగ్ మ్యాచులు ఆడనుంది. తొలి పోరులో భారత జూన్ 5న ఐర్లాండ్‌ను ఢీకొట్టనుంది. దాయాది పాకిస్థాన్‌తో జూన్ 9న న్యూయార్క్‌లో టీమిండియా తలపడనుది. జూన్ 12న న్యూయార్క్ స్టేడియంలో ఆతిథ్య అమెరికా జట్టుతో.. 15వ తేదీన ఫ్లోరిడాలో కెనాతో భారత్ అమీతుమీ తేల్చుకోనుంది.
గ్రూప్ బి జట్లు : ఇంగ్లండ్, ఆస్ట్రేలియా, నమీబియా, స్కాట్లాండ్, ఒమన్.
గ్రూప్ సి జట్లు : న్యూజిలాండ్, వెస్టిండీస్, అఫ్గనిస్థాన్, ఉగాండా, పపువా న్యూ గినియా.
గ్రూప్ డి జట్లు : దక్షిణాఫ్రికా, శ్రీలంక, బంగ్లాదేశ్, నెదర్లాండ్స్, నేపాల్.









