AMMA
NEWS
NETWORK

మా ఈ పేపర్ చదవండి :  

మేడిగడ్డ బ్యారేజ్ కుంగుబాటుపై విచారణ ప్రారంభం

కాళేశ్వరం ప్రాజెక్టులో భాగంగా నిర్మించిన మేడిగడ్డ ఆనకట్ట కుంగుబాటు రాష్ట్రంలో కలకలం రేపిన విషయం తెలిసిందే. ఈ కుంగుబాటుకు కారణాలను తెలుసుకునేందుకు విచారణ ప్రక్రియ ప్రారంభమైంది. ఎలక్ట్రికల్ రెసిస్టివిటీ మెథడ్‌ (ఈఆర్ఎం) విధానాన్ని ఉపయోగించి నిర్ధరణ పరీక్షలు చేయనున్నట్లు అధికారులు తెలిపారు. మేడిగడ్డ వద్ద నిర్మించిన లక్ష్మీ ఆనకట్టలోని ఏడో బ్లాక్‌ గత అక్టోబర్‌లో కుంగిన విషయం తెలిసిందే. ఏడో బ్లాక్‌లోని20 వ పిల్లర్‌తో పాటు 19, 21 పిల్లర్లు కొంత మేర కుంగాయి. అయితే అందుకు కారణాలు తెలుసుకోవడంపై అధికారులు, ఇంజనీర్లు ఇప్పటికే దృష్టి సారించారు. విచారణ కోసం ఇప్పటికే కాఫర్‌ డ్యాం నిర్మాణ పనులు చేపట్టారు. మరోవైపు కుంగుబాటుకు గురైనచోట భారీ మోటార్లతో నీరు తోడుతున్నారు. ప్రాథమిక పరీక్షలతోపాటు ఇన్వెస్టిగేషన్ పనులు కొనసాగుతున్నాయి. తొలుత కుంగుబాటుకు గురైన ఏడో బ్లాక్ వద్ద పరీక్షలు నిర్వహించి ఆ తర్వాత మిగిలిన బ్లాకులలో పరీక్షలు చేస్తామని అధికారులు తెలిపారు.

ANN TOP 10