AMMA
NEWS
NETWORK

మా ఈ పేపర్ చదవండి :  

హైదరాబాదీలను వణికిస్తున్న చలి

హైదరాబాద్ ను చలి వణికిస్తోంది. రాత్రి పూట ఉష్ణోగ్రతలు పడిపోతున్నాయి. పగటి పూట కూడా సాధారణం కంటే తక్కువ ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. వాకింగ్ కు వెళ్లేందుకు బయట అడుగుపెట్టాలంటే నగరవాసులు భయపడుతున్నారు. రాత్రి ఉష్ణోగ్రతలు సాధారణం కంటే 4 నుంచి 5 డిగ్రీలు తక్కువగా నమోదవుతున్నాయి. ఫలితంగా చలిగాలుల తీవ్రత చాలా ఎక్కువగా ఉంటోంది. నగరంతో పాటు చుట్టుపక్కల ప్రాంతాల్లో కూడా మరో రెండు రోజులు ఇదే పరిస్థితి ఉంటుందని బేగంపేట వాతావరణ శాఖ అధికారులు తెలిపారు. గరిష్ఠంగా 27 డిగ్రీలు, కనిష్ఠంగా 16 డిగ్రీల ఉష్ణోగ్రతలు ఉంటాయని చెప్పారు. సోమవారం అత్యల్పంగా పటాన్‌చెరు, రామచంద్రాపురంలో 14.8 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదైందని ఐఎండీ పేర్కొంది.

నగరంలోని వివిధ ప్రాంతాల్లో సోమవారం నమోదైన ఉష్ణోగ్రతల వివరాలు..

రాంచంద్రాపురం 14.8
రాజేంద్రనగర్‌ 14.9
సికింద్రాబాద్‌ 15.4
కుత్బుల్లాపూర్‌ 15.7
హయత్‌నగర్‌ 15.8
మల్కాజిగిరి 16.3
గాజులరామారం 16.3
కూకట్‌పల్లి 16.7
బేగంపేట 16.9

ANN TOP 10