AMMA
NEWS
NETWORK

మా ఈ పేపర్ చదవండి :  

వారం రోజుల వ్యవధిలో ఒకే కుటుంబంలో ఆరుగురి హత్య

నిజామాబాద్ జిల్లాలో ఘోరం…
స్నేహితుడే హత్య చేసినట్లుగా ఆరోపణలు
ప్రసాద్, అతని భార్య, ఇద్దరు పిల్లలు, ఇద్దరు చెల్లెళ్ల హత్య
సినిమా టిక్‌గా ఒక్కరొక్కరినీ హత్య చేసిన నిందితుడు
నిజామాబాద్ జిల్లాలో దారుణం జరిగింది. ఒకే కుటుంబానికి చెందిన ఆరుగురిని హత్య చేశారు. ఈ దారుణానికి పాల్పడింది స్నేహితుడేనని తెలుస్తోంది. ఈ నెల 9వ తేదీ నుంచి వారం రోజుల వ్యవధిలో వీరంతా హత్యకు గురైనట్లుగా చెబుతున్నారు. నిజామాబాద్ జిల్లా డిచ్‌పల్లి మండలం మాట్లారుకు చెందిన మాక్లూర్ ప్రసాద్‌ను అతని స్నేహితుడు ప్రశాంత్ హత్య చేసినట్లుగా చెబుతున్నారు. వివరాల ప్రకారం… ప్రశాంత్ తన స్నేహితుడి శవాన్ని డిచ్‌పల్లి హైవే పక్కన పూడ్చిపెట్టాడు. ఆ తర్వాత ప్రసాద్ పోలీసుల అదుపులో ఉన్నాడని నమ్మబలికి… అతని భార్యను కూడా ప్రశాంత్ తీసుకు వెళ్లాడు. బాసర వద్ద గోదావరిలో పడేశాడు. ఆ తర్వాత వారి ఇద్దరి పిల్లలను చంపి పోచంపాడ్ సోన్ బ్రిడ్జి వద్ద కాలువలోకి తోసేశాడు. ఆ తర్వాత ప్రసాద్‌ను, అతని భార్యను, పిల్లలను పోలీసులు తీసుకువెళ్లారని చెప్పి… ప్రసాద్ ఇద్దరు చెల్లెళ్లను వేర్వేరుగా తీసుకువెళ్లి ప్రశాంత్ హత్య చేశాడు.

మాట్లాడే పని ఉందంటూ ప్రసాద్‌ను బయటకు తీసుకెళ్లి.. కామారెడ్డి జాతీయ రహదారి సమీపంలో చంపేశాడు. మరుసటి రోజు ప్రసాద్ ఇంటికెళ్లాడు. ప్రసాద్‌ను పోలీసులు అరెస్ట్ చేశారని నమ్మించి ఆయన భార్యను బయటకు తీసుకెళ్లాడు. ఆమెను చంపేసి బాసర నదిలో మృతదేహం పడేశాడు. ఆ తర్వాత ప్రసాద్‌ పెద్ద సోదరిని హతమార్చాడు. ఇద్దరు పిల్లల్ని సోన్ బ్రిడ్జి సమీపంలో .. చిన్న సోదరిని మాచారెడ్డి సమీపంలో దారుణంగా చంపేశాడు.

మొదటి మూడు హత్యలు ప్రశాంత్‌.. మిగతా ముగ్గురి హత్యల్లో మరో ముగ్గురి ప్రమేయం ఉన్నట్టు పోలీసులు ప్రాథమికంగా నిర్ధారణకు వచ్చారు. సంచలనం సృష్టించిన ఈ కేసులో అన్ని కోణాల్లో పోలీసులు విచారిస్తున్నారు. అయితే ఈ కేసుపై ప్రస్తుతం విచారణ కొనసాగుతోంది. నిందితుడు ప్రశాంత్ క్రైమ్ బ్యాగ్రౌండ్‌పైనా ఆరాతీస్తున్నారు.

ANN TOP 10