AMMA
NEWS
NETWORK

మా ఈ పేపర్ చదవండి :  

మళ్లీపెళ్లీ.. సామ్‌ స్టాటిస్టిక్స్‌ లొల్లి

దక్షిణాది స్టార్‌ హీరోయిన్‌ సమంత విడాకుల టాపిక్‌ మళ్లీ తెరపైకి వచ్చింది. సోషల్‌ మీడియాలో ఎప్పుడూ యాక్టివ్‌గా ఉండే సమంత తాజాగా ఇన్‌స్టా గ్రామ్‌లో అభిమానులతో ముచ్చటించారు. వారు అడిగిన పలు ప్రశ్నలకు తనదైన రీతిలో సమాధానం ఇచ్చి వార్తల్లో నిలిచారు. వీకెండ్‌ సందర్భంగా ‘ఆస్క్‌ మీ’ సెషన్‌లో సమంతను ఓ అభిమాని ‘మీరు రెండో పెళ్లి ఎందుకు చేసుకోకూదు?’ అంటూ ప్రశ్నించాడు. ఈ ప్రశ్నకు సామ్‌ సమాధానం చెబుతూ.. 2023 విడాకుల స్టాటిస్టిక్స్‌ను కాస్త వ్యంగ్యంగా చెప్పుకొచ్చారు. గణాంకాల ప్రకారం అది బ్యాడ్‌ ఇన్వెస్ట్‌మెంట్‌ అని పేర్కొన్నారు. స్మైల్‌ ఎమోజీని జోడిస్తూ సమాధానం చెప్పారు.

‘కీ డివోర్స్‌ స్టాటిస్టిక్స్‌’ పేరిట సమంత షేర్‌ చేసిన ఇమేజ్‌లో 2023లో మొదటి పెళ్లి విడాకులు 50 శాతం ఉంది. రెండో, మూడోసారి పెళ్లిళ్ల విడాకులు 67 శాతం, 73 శాతంగా ఉంది. స్త్రీ, పురుషుల విషయంలోనూ ఈ రేటింగ్‌ ఇలానే ఉందట అని స్టాటిస్టిక్స్‌ను వివరించారు. ఆ తర్వాత ‘సామ్‌ మీరు దేవుడిని నమ్ముతారా?’ అని ఓ అభిమాని అడగ్గా నమ్ముతానని సమంత ఇన్‌స్టాలో సమాధానం చెప్పారు. ‘మీరు రోజూ చేసే దినచర్యలోనే మీ విజయ రహస్యం దాగి ఉంటుంది’ అనే కోట్‌ను కూడా పోస్టు చేశారు. రాబోయే కొత్త ఏడాదిలో మంచి ఆరోగ్యంతో ఉండబోతున్నట్లు నటి చెప్పుకొచ్చారు.

ANN TOP 10