ఏపీ సీఎం జగన్ మరో కీలక ప్రాజెక్టుకు శ్రీకారం చుట్టారు. ఆరోగ్యశ్రీ లబ్దిదారులకు గుడ్ న్యూస్ చెప్పారు. ఇక నుంచి ఆరోగ్యశ్రీ పరిమితి రూ 25 లక్షలకు పెంచారు. ఇదే సమయంలో కొత్త ఫీచర్లతో ఆరోగ్యశ్రీ కార్డుల పంపిణీకి ప్రభుత్వం మార్గదర్శకాలు జారీ చేసింది. వాలంటీర్లు..ఆరోగ్య సిబ్బంది ప్రతీ ఇంటికి వెళ్లనున్నారు. అలాగే ఈ పథకం ద్వారా వైద్యం ఎలా పొందాలనే దానిపైనా అర్హులకు అవగాహన కల్పించునన్నారు. మెరుగైన వైద్యం సులభతరం చేయనున్నారు.
రాష్ట్రంలోని ఆరోగ్య శ్రీ లబ్దిదారులకు ఈ 25 లక్షల వరకు వైద్యం పొందేలా నిర్ణయించారు. ఆరోగ్య శ్రీ పరిమితిని పెంచారు. ఈ మేరకు కొత్త కార్డులు జారీ చేస్తున్నారు. రాష్ట్రంలో ఇప్పటికే అమలు చేస్తున్న వైఎస్సార్ ఆరోగ్యశ్రీ పథకాలనికి మెరుగులు దిద్దుతూ.. మరింత బలోపేతం చేసేలా మరిన్ని నిర్ణయాలు తీసుకున్నారు. ప్రభుత్వం తాజాగా జారీ చేయనున్న ఆరోగ్య శ్రీ కార్దుల్లోనూ మార్పులు చేసారు. ఈ కార్డుల జారీతో పాటుగా లబ్దిదారులకు ఆరోగ్య శ్రీ వినియోగం పై అవగాహక కల్పించాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఈ మేరకు ప్రభుత్వం మార్గదర్శకాలు జారీ చేసింది.
కొత్త ఆరోగ్యశ్రీ కార్డుల్లో క్యూఆర్ కోడ్, లబ్దిదారుని ఫొటో, కుటుంబ యజమాని పేరు, ఫోన్ నెంబర్, కుటుంబ సభ్యుల వివరాలు ఉండేలా డిజైన్ చేసారు. ఎల్రక్టానిక్ హెల్త్ రికార్డులో పొందుపరిచిన లబ్ధిదారుల ఆరోగ్య వివరాలతో ఏబీహెచ్ఏ ఐడీ ఇవ్వనున్నారు. క్యూఆర్ కోడ్‌తో లాగిన్ ద్వారా రోగి చేయించుకునే వ్యాధి నిర్ధారణ పరీక్షలు, తీసుకుంటున్న వైద్యం, చికిత్సలు, డాక్టర్ సిఫార్సులు, సమీపంలోని ఆసుపత్రులు, ఆ ఆసుపత్రులకు చేరేందుకు గూగుల్ మ్యాప్స్ ద్వారా అనుసంధానమైన మార్గాలు తెలుసుకోవచ్చు . ఆరోగ్యమిత్ర కాంటాక్టు నంబర్లు సైతం తెలుసుకునే వీలు కల్పించారు. రోగి ఆరోగ్య పరిస్థితులపై డాక్టర్లకు, సిబ్బందికి పూర్తి అవగాహన కలిగేలా చేస్తూ..మెరుగైన ఉచిత వైద్యం లభించేందుకు మార్గం సులభతరం అయ్యేలా నిర్ణయించారు.









