AMMA
NEWS
NETWORK

మా ఈ పేపర్ చదవండి :  

విజయవాడలో సూపర్ స్టార్ కృష్ణ విగ్రహం.. మహేశ్ బాబు స్పందన

విజయవాడ గురునానక్ కాలనీలో సూపర్ స్టార్ కృష్ణ విగ్రహాన్ని ఏర్పాటు చేసిన సంగతి తెలిసిందే. కృష్ణ విగ్రహాన్ని ఇవాళ నట దిగ్గజం కమలహాసన్, వైసీపీ నేత దేవినేని అవినాశ్ ఆవిష్కరించారు. దీనిపై టాలీవుడ్ సూపర్ స్టార్, కృష్ణ తనయుడు మహేశ్ బాబు స్పందించారు.

“విజయవాడలో కృష్ణ గారి విగ్రహం ఆవిష్కరించడం పట్ల కమలహాసన్ సర్ కు, దేవినేని అవినాశ్ గారికి హృదయపూర్వక ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. వారు నాన్న గారి విగ్రహాన్ని ఆవిష్కరించడం నిజమైన గౌరవంగా భావిస్తున్నాను. నాన్న గారు వదిలి వెళ్లిన ఘనమైన చరిత్రకు ఇది నివాళి వంటిది. ఈ విగ్రహావిష్కరణకు తోడ్పాటు అందించిన అభిమానులందరికీ మనస్ఫూర్తిగా కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాను. మీ ప్రేమ నన్ను ముగ్ధుడ్ని చేసింది” అంటూ పేర్కొన్నారు.

ANN TOP 10