AMMA
NEWS
NETWORK

మా ఈ పేపర్ చదవండి :  

కాంగ్రెస్ ఫైనల్ లిస్ట్ విడుదల..

తెలంగాణ అసెంబ్లీ ఎన్నికలకు సంబంధించి కాంగ్రెస్ తన తుది జాబితాను విడుదల చేసింది. పెండింగ్ లో ఉన్న నాలుగు స్థానాలకు అభ్యర్థులకు ప్రకటించడంతో పాటు పటాన్ చెరు అభ్యర్థిని మార్చింది. పటాన్ చెరు టికెట్ ను గతంలో నీలం మధుకు కేటాయించిన కాంగ్రెస్.. ఆయన స్థానంలో ఆ టికెట్ ను కాటా శ్రీనివాస్ గౌడ్ కు ఇచ్చింది. ఇక సూర్యాపేట టికెట్ ను రాంరెడ్డి దామోదర్ రెడ్డికే ఇచ్చింది.

కాంగ్రెస్ ఫైనల్ లిస్ట్ :
పటాన్ చెరు – కాటా శ్రీనివాస్ గౌడ్
చార్మినార్ – మహ్మద్ ముజీబ్ ఉల్లా షరీఫ్
మిర్యాలగూడ – బత్తుల లక్ష్మా రెడ్డి
సూర్యాపేట – రాంరెడ్డి దామోదర్ రెడ్డి
తుంగతుర్తి (ఎస్సీ) – మందుల శామ్యూల్

కాగా, అద్దంకి దయాకర్ కు కాంగ్రెస్ హైకమాండ్ బిగ్ షాక్ ఇచ్చింది. తుంగతుర్తి సీటుపై ఆయన ఎన్నో ఆశలు పెట్టుకున్నారు. తుంగతుర్తి టికెట్ తనకే ఇస్తారని చివరి నిమిషం వరకు ఆశించారు. కానీ, కాంగ్రెస్ పెద్దలు అద్దంకి దయాకర్ కు హ్యాండ్ ఇచ్చారు. తుంగతుర్తి టికెట్ ను శామ్యూల్ కు కేటాయిస్తూ కాంగ్రెస్ హైకమాండ్ నిర్ణయం తీసుకుంది.

కాగా, ఇప్పటికే కాంగ్రెస్ అభ్యర్థులుగా రాంరెడ్డి దామోదర్ రెడ్డి, బత్తుల లక్ష్మారెడ్డి నామినేషన్లు దాఖలు చేయడం విశేషం. రేపు సంబంధిత ఆర్వోకు వారిద్దరూ పార్టీ బీ ఫారం ను అందజేయనున్నారు.

ANN TOP 10