AMMA
NEWS
NETWORK

మా ఈ పేపర్ చదవండి :  

కేటీఆర్‌కు తప్పిన ప్రమాదం.. నామినేషన్ ర్యాలీలో అపశ్రుతి

నిజామాబాద్‌ జిల్లా ఆర్మూర్‌లో నిర్వహించిన బీఆర్ఎస్ నామినేషన్‌ ర్యాలీలో అపశ్రుతి చోటుచేసుకుంది. బీఆర్ఎస్ అభ్యర్థి జీవన్‌రెడ్డి నామినేషన్‌ కార్యక్రమానికి మంత్రి కేటీఆర్‌ హాజరయ్యారు. బీఆర్ఎస్ శ్రేణులు ర్యాలీగా రిటర్నింగ్‌ అధికారి కార్యాలయానికి బయల్దేరారు. కేటీఆర్‌, ఇతర నేతలు ప్రచార వాహనంపై వెళ్లారు. ఈ క్రమంలో వాహన డ్రైవర్‌ అకస్మాత్తుగా బ్రేక్‌ వేయడంతో కేటీఆర్‌, ఎంపీ సురేశ్‌రెడ్డి, బీఆర్ఎస్ అభ్యర్థి జీవన్‌రెడ్డి కిందపడిపోయారు. సడన్‌ బ్రేక్‌తో వాహన రెయిలింగ్‌ ఊడిపోవడంతో వారంతా కిందపడ్డారు. కిందపడడంతో కేటీఆర్‌కు స్వల్ప గాయాలయ్యాయి. ఆర్మూర్‌ పట్టణంలోని పాత ఆలూర్‌ రోడ్డు వద్ద ఈ ఘటన చోటుచేసుకుంది. ఎవరికీ ఏం కాకపోవడంతో జీవన్‌రెడ్డితో పాటు కేటీఆర్‌ నామినేషన్‌ కేంద్రానికి వెళ్లారు.

ANN TOP 10