AMMA
NEWS
NETWORK

మా ఈ పేపర్ చదవండి :  

అంబులెన్స్‌లో వచ్చి నామినేషన్‌ వేసిన ఎంపీ కొత్త ప్రభాకర్‌రెడ్డి

బీఆర్‌ఎస్‌ అభ్యర్థి, ఎంపీ కొత్త ప్రభాకర్‌ రెడ్డి దుబ్బాకలో (Dubbak) నామినేషన్‌ దాఖలు చేశారు. సికింద్రాబాద్‌ యశోధ హాస్పిటల్‌ నుంచి అంబులెన్సులో దుబ్బాకకు చేరుకున్న ఆయన.. వీల్‌ చైర్‌లో వెళ్లి ఆర్వో కార్యాలయంలో నామినేషన్‌ పత్రాలను సమర్పించారు. అంతకుముందు దుబ్బాక పట్టణంలో భారీ ర్యాలి నిర్వహించారు. ఈ కార్యక్రమంలో మంత్రి హరీశ్‌ రావు, పార్టీ నాయకులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.

అక్టోబర్‌ 30న సిద్దిపేట జిల్లా దుబ్బాక నియోజకవర్గంలో సోమవారం ఎన్నికల ప్రచారంలో పాల్గొన్న మెదక్‌ ఎంపీ, బీఆర్‌ఎస్‌ దుబ్బాక అభ్యర్థి కొత్త ప్రభాకర్‌రెడ్డిపై జరిగిన హత్యాయత్నం జరిగిన విషయం తెలిసిందే. మిరుదొడ్డిలో ఎన్నికల ప్రచారం నిర్వహిస్తుండగా చెపాల్య గ్రామానికి చెందిన గటాని రాజు.. ఎంపీ ప్రభాకర్‌రెడ్డిని పొత్తికడుపులో కత్తితో పొడిచాడు. దీంతో ఆయనను హుటాహుటిన గజ్వేల్‌ దవాఖానకు తరలించగా.. ప్రథమ చికిత్స అనంతరం అక్కడికి మెరుగైన వైద్యం కోసం సికింద్రాబాద్‌లోని యశోద దవాఖానకు తీసుకెళ్లారు. దవాఖానలో చికిత్స పొందుతున్న ఆయన గురువారం ఉదయం దవాఖాన నుంచి అంబులెన్సులో దుబ్బాకకు వెళ్లారు.

ANN TOP 10