– ఐటీ దాడులపై పొంగులేటి ఫైర్
– రూ. వేల కోట్లు బీఆర్ఎస్ నేతలతో మూలుగుతుంటే నాపై దాడులా?
– అత్యంత హేమమైన చర్య ఇది
– ఎన్నికల సంఘానికి ఫిర్యాదు చేస్తామంటూ స్పష్టీకరణ
ఇక తగ్గేదేలే.. ఐటీ దాడులకు అదరం.. బెదరం.. బీఆర్ఎస్ అరాచకాలపై తెగించి కొట్లాడుతాం.. వేల కోట్ల రూపాయలు బీఆర్ఎస్ ప్రభుత్వం, నాయకుల వద్ద ఉన్నాయని, ఐటీ అధికారులు తన ఇంటి, కాంగ్రెస్ నాయకుల ఇళ్లపై దాడులు చేయడం హేయమైన చర్య అని పొంగులేటì శ్రీనివాసరెడ్డి ఘాటుగా విమర్శించారు. గురువారం ఐటీ దాడుల నేపథ్యంలో ఆయన మీడియాతో మాట్లాడారు.
æ తన ఇంటిపై ఐటీ దాడులు చేయడం పట్ల కేంద్ర ఎన్నికల సంఘానికి ఫిర్యాదు చేస్తామని అన్నారు. నామినేషన్ దాఖలు చేసే అధికారం ప్రతి ఒక్కరికీ ఉంటుందని, అరచేతిని అడ్డు పెట్టుకుని సూర్యకాంతిని ఆపలేరని వ్యాఖ్యానించారు. ఇటువంటి చర్యలకు పాల్పడి కాంగ్రెస్ విజయాన్ని ఆపలేరని ధీమా వ్యక్తం చేశారు. డిసెంబర్ 3 వ తేదీన కాంగ్రెస్ గెలుపొందడం పక్కా అంటూ పొంగులేటి శ్రీనివాసరెడ్డి ధీమా వ్యక్తం చేశారు.
బీఆర్ఎస్, బీజేపీ.. వేధిస్తున్నాయి..
‘ఐటీ, సీఆర్పీఎఫ్ అధికారులు పది మంది ఇంటికి వచ్చారు. నాకు ముందే తెలుసు. రాష్ట్ర వ్యాప్తంగా కాంగ్రెస్ నేతల ఇళ్ల మీద దాడులు సాగుతున్నాయి. ఆపద్ధర్మ సీఎం కేసీఆర్.. బీజేపీతో కుమ్మక్కు అయ్యారు. ఐటీ దాడులను చేయిస్తున్నారు. నా మీద ఫోకస్ పెట్టీ ఇబ్బందులు పెడతారని తెలుసు. నా మీద, మువ్వ విజయబాబు మీద వేధింపులు స్టార్ట్ చేశారు. బీజేపీలోకి రాలేదని, బీఆర్ఎస్ నుంచి బయటకు వెళ్లానని… ఆ రెండు పార్టీల నేతలు ఇబ్బందులు పెడుతున్నారు. బీఆర్ఎస్ నుంచి జనవరిలో బయటకు వచ్చినప్పటి నుంచి ఇబ్బందులు తప్పడంలేదు.
కేసీఆర్‌ను విమర్శించే వారిని కేసులు పెట్టి వేధింపులకు గురి చేయడం బీఆర్ఎస్కు అలవాటు. 32 ప్రాంతాల్లో వేర్వేరు రాష్ట్రాల నుంచి యుద్ధ ప్రాతిపదికన సోదాలు జరుగుతున్నాయి. రాజ్యాంగపరంగా పోరాడుతాను. ఎన్ని సోదాలు చేసినా∙ఇబ్బందులు పెట్టినా భయపడను. జైల్లో పెట్టిన్పటికీ నేను వెనకకి తగ్గేది లేదు. బీఆర్ఎస్ లక్షలాది రూపాయలు ఖర్చు పెడుతుంటే వారిపై ఎందుకు తనిఖీలు చేయడంలేదు. ఏడాది పాటు జైల్‌కు పంపినా నేను పోరాటం చేస్తాను. నామినేషన్ వేయకుండా చేస్తే లక్షలాది మంది వస్తారని చెప్పాను. దొడ్డిదారిన ఇబ్బందులు పెడుతున్నారు.. ప్రజలు బుద్ధి చెబుతారు’’ అంటూ పొంగులేటి శ్రీనివాసరెడ్డి ఘాటుగా హెచ్చరించారు.









