AMMA
NEWS
NETWORK

మా ఈ పేపర్ చదవండి :  

సీఎం కేసీఆర్ సమక్షంలో బీఆర్ఎస్‌లో చేరిన నాగం జనార్ధన్ రెడ్డి, విష్ణువర్ధన్ రెడ్డి

కాంగ్రెస్ నేతలు విష్ణువర్ధన్ రెడ్డి, నాగం జనార్థన్ రెడ్డి, సీఎం కేసీఆర్ సమక్షంలో బీఆర్ఎస్ లో చేరారు. తెలంగాణ భవన్ లో సీఎం కేసీఆర్ సమక్షంలో పార్టీలో చేరారు. కరీంనగర్ కాంగ్రెస్ నేత జైపాల్ రెడ్డి కూడా బీఆర్ఎస్ లో చేరారు.వీరితో పాటు మరికొంతమంది నేతలు కూడా గులాబీ పార్టీలో చేరారు. ఈ సందర్భంగా కేసీఆర్ మాట్లాడుతూ..నాగం జనార్ధన్ రెడ్డికి తెలంగాణ ఉద్యమ చరిత్ర ఉందని..ఎన్నో సార్లు జైలుకు వెళ్లిన నేపథ్యం ఉందని అన్నారు. నేను ప్రత్యేకించి నాగంను రిక్వెస్ట్ చేశానని తన మాటను గౌరవించి ఆయన పార్టీలో చేయటం సంతోషంగా ఉందన్నారు. విష్ణు వర్ధన్ రెడ్డి కూడా పార్టీలో చేరటం సంతోషమన్నారు. విష్ణు వర్ధన్ రెడ్డి భవిష్యత్తు నాది బాధ్యత అంటూ గులాబీ బాస్ భరోసా ఇచ్చారు. విష్ణు తండ్రి పీజేఆర్ తనకు మంచి మిత్రుడు అంటూ ఈ సందర్భంగా కేసీఆర్ గుర్తు చేసుకున్నారు. పీజేఆర్ తనయుడు నా కుటుంబ సభ్యుడు అంటూ చెప్పుకొచ్చారు. నాగం పార్టీలో చేరటంతో బలం మరింత పెరిగిందన్నారు.

మహబూబ్ నగర్ లో 14 స్థానాలు గెలవాలని అన్నారు. గోపీనాథ్, విష్ణు కలిసి పనిచేయండి..అందర్నీ కలుపుకుంటూ ముందుకెళ్లి పనిచేయండి అంటూ సూచించారు.తెలంగాణ అభివృద్ది వేగంగా జరుగుతుందన్నారు. ఎంపి కొత్త ప్రభాకర్ రెడ్డి నీ చంపాలని చూసారు అంటూ మండిపడ్డారు. కానీ దేవుడి దయ వల్ల ప్రభాకర్ బ్రతికి బయట పడ్డాడని ఇటువంటి హత్యా రాజకీయాలన్ని సహించబోము అంటూ వార్నింగ్ ఇచ్చారు.

ANN TOP 10