అందరి గురి దస్ కా దమ్‌పైనే..
పదికి పది సీట్లు మావంటే మావే..
ఉద్దండుల పోరుతో హీటెక్కిన రాజకీయాలు
‘గుమ్మం’లో రసవత్తరం
రాజకీయాలందు.. ఖమ్మం రాజకీయాలు వేరయా..!! అవును.. తెలంగాణ రాజకీయాలంతా ఒక ఎత్తు అయితే.. ఒక్క ఖమ్మం జిల్లా రాజకీయాలు మరో ఎత్తు..!! రసవత్తర రాజకీయాలకు గుమ్మం.. ఖమ్మం. నువ్వా–నేనా సై అనే లేవల్‌లో సవాళ్లు విసురుకుంటున్నారు. ఎవరైనా సరే వాళ్లకు కేటాయించిన సీటులో వాళ్లే గెలవాలని చూస్తారు. కానీ అక్కడ సీను అలా లేదు. దస్ కా దమ్ అంటూ ఏకంగా టెన్ ఔటాఫ్ టెన్‌పై గురిపెట్టారు. జిల్లాలో సీఎం కేసీఆర్ బహిరంగ సభ ముగిశాక మాటల యుద్ధం భీకరంగా తయారైంది. సీఎం కేసీఆర్ ఆరోపణలకు తుమ్మల కూడా అంతే రేంజ్‌లో కౌంటర్ ఇచ్చారు.
నిన్నటి దాక పొంగులేటి– పువ్వాడ మధ్య మాటలు.. తూటాలు. తుమ్మల సీన్‌లోకి వచ్చాక ఖమ్మం రాజకీయాలే కాదు.. ఆయన డైలాగులూ మరో లేవల్. ఖమ్మం అడ్డాగా ఖాకీలను టార్గెట్ చేస్తూ డైనమైట్ లాంటి డైలాగులు పేల్చారు తుమ్మల. ఖమ్మం జిల్లా రఘునాథపాలెంలో తుమ్మల నాగేశ్వరావు, భట్టి సహా ఇతర నేతలు ప్రచారం నిర్వహించారు. కొందరు అక్రమ కేసుల వ్యవహారం వాళ్ల ముందు పెట్టడంతో తుమ్మల కొన్ని సంచలన వ్యాఖ్యలు చేశారు. క్షమాపణ చెప్పకుండా, కేసులు కొట్టేయకుండా ఏ ఒక్క పోలీస్‌ను బదిలీ కూడా చేసేది లేదని వార్నింగ్ ఇచ్చారు తమ్మల. అంతే బీఆర్‌ఎస్ నుంచి ఖండన బాణం దూసుకు రానే వచ్చింది. తుమ్మల వ్యాఖ్యలకు కౌంటర్ ఇచ్చారు పువ్వాడ అజయ్. అహంకార పూరిత వ్యాఖ్యలను ప్రజలను గమనించాలన్నారు.
ఖమ్మం ప్రజలు బీఆర్‌ఎస్‌తోనే ఉన్నారంటూ ప్రచారాన్ని ముమ్మరం చేస్తున్నారు పువ్వాడ అజయ్. ఖమ్మం ఖచ్చితంగా కాంగ్రెస్ చేతికేనంటున్నారు తుమ్మల. నియోజకవర్గ వ్యాప్తంగా ప్రచారాన్ని కొనసాగిస్తున్నారు. 40 ఏళ్లు కష్టపడి జిల్లాను అన్ని రంగాల్లో అభివృద్ధి చేశానన్నారు. రాహుల్–రేవంత్ ఆహ్వానం మేరకే కాంగ్రెస్‌లో చేరానన్నారు. ఖమ్మం జిల్లాలో అవినీతి అరాచకాలను తరిమి కొట్టాలని పిలుపునిచ్చారు తుమ్మల. ఖమ్మంలో పువ్వాడ అజయ్– తుమ్మల నాగేశ్వరరావు మధ్య సవాళ్ల వార్ పీక్ స్థాయికి వెళ్లింది. నాట్ ఓన్లీ ఖమ్మం. జిల్లాలోని పదికి పది నియోజవర్గాల్లో బీఆర్‌ఎస్‌దే గెలుపని పువ్వాడ.. జిల్లాలో టోటల్‌గా క్లీన్ స్వీప్ కాంగ్రెస్‌దేనని తుమ్మల శపథాలు చేశారు. పరస్పర ఆరోపణలు..విమర్శలు సవాళ్లతో ఖమ్మం రాజకీయం అంతకంతకూ వేడెక్కుతోంది.









