AMMA
NEWS
NETWORK

మా ఈ పేపర్ చదవండి :  

ఒడిలో వృద్ధురాలితో.. మంత్రి మల్లారెడ్డి విచిత్ర విన్యాసాలు

తెలంగాణ రాష్ట్రంలో ఎన్నికల సమయంలో ఆసక్తికరమైన సంఘటనలు జరుగుతున్నాయి. తాజాగా జరుగుతున్న ఎన్నికలలోను ఆసక్తికరమైన దృశ్యాలు కనిపిస్తున్నాయి. ఓటర్లు మద్దతును పొందడం కోసం మంత్రి మల్లారెడ్డి చేసే విన్యాసాలు మాత్రం వర్ణనాతీతం అనే చెప్పాలి. పాలమ్మిన.. పూలమ్మిన అంటూ తనదైన శైలిలో డైలాగులతో ఆకట్టుకున్న మంత్రి మల్లారెడ్డి, తాజాగా వినూత్నంగా ప్రచారం చేస్తూ దూసుకుపోతున్నారు. తన ఎన్నికల ప్రచారంలో ఉత్సాహంగా తిరుగుతున్న మంత్రి మల్లారెడ్డి ఓ వృద్ధురాలిని తన ఒడిలో కూర్చోబెట్టుకొని ఎన్నికల ప్రచారాన్ని నిర్వహించారు .

ఇప్పుడు మల్లారెడ్డి వృద్ధురాలిని ఒడిలో కూర్చోబెట్టుకున్న దృశ్యాలు సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి. మేడ్చల్ మున్సిపాలిటీ పరిధిలోని 18వ వార్డులో వివిధ పార్టీలకు చెందిన మహిళలు మంత్రి మల్లారెడ్డి సమక్షంలో బీఆర్ఎస్ పార్టీలో చేరారు. ఆ సమయంలో మహిళలు అంత కింద కూర్చుని ఉండగా మల్లారెడ్డి సైతం వారితోనే కింద కూర్చున్నారు.

తెలంగాణకు, కెసిఆర్ కు అనుకూలంగా నినాదాలు చేసిన మంత్రి మల్లారెడ్డి ఒక వృద్ధురాలిని ముందుకు రమ్మని పిలిచి ఒడిలో కూర్చోబెట్టుకొని ఫోటోకు ఫోజులిచ్చారు. ఒక మంత్రి మల్లారెడ్డి చేసిన పని చూసిన అక్కడ వారంతా షాక్ అవ్వటం తో పాటు బాగా నవ్వుకున్నారు. అయితే మంత్రి మల్లారెడ్డి చర్య పైన సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున ట్రోల్స్ చేస్తున్నారు.

ANN TOP 10