అధికారమే లక్ష్యంగా కాంగ్రెస్ దూకుడు పెంచింది. ఇప్పటికే అగ్రనేతలంతా తెలంగాణ ప్రచారాన్ని ప్రారంభించారు. తొలివిడత విజయభేరి బస్సు యాత్రలో రాహుల్ గాంధీ పాల్గొని ప్రచారం నిర్వహించిన విషయం తెలిసిందే. ఇవ్వాల్టి నుంచి అగ్రనేతలు రెండో విడత బస్సు యాత్రను చేపట్టనున్నారు. కాంగ్రెస్పార్టీ రెండో విడత విజయభేరి బస్సు యాత్ర కాసేపట్లో ప్రారంభం కానుంది. నవంబర్2వ తేదీ వరకు ఆరు రోజుల పాటు సాగనుంది.
రెండో విడతలో 7 పార్లమెంట్ నియోజకవర్గాల పరిధిలోని 17 అసెంబ్లీ నియోజకవర్గాల్లో పార్టీ జాతీయ స్థాయి నాయకులు ప్రచారం చేయనున్నారు. కర్నాటక డిప్యూటీ సీఎం డీకే శివకుమార్చేవెళ్ల పార్లమెంట్ సెగ్మెంట్లోని తాండూరు, పరిగి, చేవెళ్లలో పర్యటించనున్నారు. ఆదివారం ఏఐసీసీ చీఫ్మల్లికార్జున ఖర్గే మెదక్లోక్సభ సెగ్మెంట్లోని సంగారెడ్డి, నర్సాపూర్, మెదక్‌లో బస్సు యాత్రలో పాల్గొంటారు. సంగారెడ్డి, మెదక్‌లో జరిగే సభల్లో ఖర్గే పాల్గొంటారు.









