తెలంగాణలో ఎన్నికలు సమీపిస్తున్న వేళ కీలక పరిణామాలు చోటు చేసుకుంటున్నాయి. ఇప్పటికే చాలా మంది కీలక నేతలు ఇతర పార్టీల నుంచి కాంగ్రెస్‌లో చేరగా.. తాజాగా కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డితో పాటు మోత్కుపల్లి నర్సింహులు, ఏనుగు రవీందర్ రెడ్డి, నీలం మధు వంటి నేతలు హస్తం పార్టీ కండువాను కప్పుకున్నారు.

పటాన్‌చెరు నియోవజకవర్గానికి చెందిన నీలం మధు ముదిరాజ్ కూడా కాంగ్రెస్ పార్టీలో చేరారు. బీఆర్ఎస్ పార్టీ టికెట్ ఆశించి భంగపడ్డ ఆయన.. టికెట్ రాకపోవటంతో ఆ పార్టీకి రాజీనామా చేశారు. ఇండిపెండెంట్‌గానైనా పోటీ చేస్తానని ప్రకటించారు. ఈ మేరకు కాంగ్రెస్ పార్టీతో సంప్రదింపులు జరిపి తాజాగా.. ఖర్గే సమక్షంలో హస్తం గూటికి చేరారు. ఆయనకు పటాన్ చెరు కాంగ్రెస్ టికెట్ కేటాయించనున్నట్లు తెలుస్తోంది.










