ఆరోగ్య మహిళ పథకం ప్రారంభం
తెలంగాణలో మహిళల అనేక రకాల కష్టాలు తీర్చిన ఘనత ముఖ్యమంత్రి కేసీఆర్ కే దక్కుతుందని ఆరోగ్యశాఖ మంత్రి హరీష్ రావు తెలిపారు.మహిళల కోసం ఆరోగ్య మహిళ,కళ్యాణ లక్ష్మీ,కేసీఆర్ కిట్,మిషన్ భగీరథ లాంటి ఎన్నో పథకాలు అమలు చేస్తున్నామని చెప్పారు.కరీంనగర్లో మంత్రి గంగుల కమలాకర్ తో కలిసి ఆయన ఆరోగ్య మహిళా పథకాన్ని ప్రారంభించారు.ఈ పథకంలో మహిళలకు 8రకాల ప్రత్యేక వైద్య సేవలు అందుబాటులో ఉంటాయన్నారు. తెలంగాణలో 100 ఆరోగ్య మహిళా కేంద్రాలు ఏర్పాటు చేస్తామన్నారు.రానున్న రోజుల్లో వీటి సంఖ్య పెంచుతామన్నారు. ప్రతీ మంగళవారం మహిళలకు వైద్యపరీక్షలు నిర్వహిస్తామని చెప్పారు.కార్పోరేట్ ఆసుపత్రుల తరహాలో ఈ కేంద్రాల్లో వైద్య సేవలందిస్తామని తెలిపారు.ఆరోగ్య మహిళా సేవలను ప్రతీ మహిళా సద్వినియోగం చేసుకోవాలని సూచించారు.