AMMA
NEWS
NETWORK

మా ఈ పేపర్ చదవండి :  

మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి ఇంట తీవ్ర విషాదం.. కేసీఆర్ సంతాపం

రాష్ట్ర రోడ్లు భవనాల శాఖ మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి ఇంట తీరని విషాదం నెలకొంది. మంత్రి ప్రశాంత్ రెడ్డి తల్లి నేడు తుది శ్వాస విడిచారు. గత కొద్ది రోజులుగా తీవ్ర అనారోగ్యంతో బాధపడుతున్న మంత్రి ప్రశాంత్ రెడ్డి తల్లి మంజులమ్మ.. హైదరాబాద్‌లోని ఓ ప్రైవేటు ఆస్పత్రిలో చికిత్స పొందుతూ ఈ మధ్యాహ్నం (అక్టోబర్ 12)న తుదిశ్వాస విడిచారు. తన తల్లి మరణంతో మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి శోకసంద్రంలో మునిగిపోయారు. కాగా.. మంత్రి స్వగ్రామమైన నిజామాబాద్‌ జిల్లా వేల్పూర్‌లో రేపు ఉదయం అంత్యక్రియలు నిర్వహించనున్నారు. మంజులమ్మ మృతి పట్ల పలువురు ప్రజాప్రతినిధులు సంతాపం ప్రకటించారు. తల్లి మరణంతో శోకంలో మునిగిపోయిన మంత్రి వేముల ప్రశాంతి రెడ్డితో పాటు.. వారి కుటుంబ సభ్యులకు సీఎం కేసీఆర్ ప్రగాఢ సానుభూతిని ప్రకటించారు.

ANN TOP 10