AMMA
NEWS
NETWORK

మా ఈ పేపర్ చదవండి :  

నామినేషన్‌ దాఖలుకు మంచి ముహూర్తం ఆ నాలుగు రోజులేనట!

తెలంగాణలో ఎన్నికల నగారా మోగింది. నామినేషన్లకు కూడా త్వరలో తెరలేవనుంది. తెలంగాణ అసెంబ్లీ ఎన్నికలకు సంబంధించి నవంబర్‌ 3న నామినేషన్లకు నోటిఫికేషన్‌ వస్తుంది. నవంబర్‌ పదో తేదీ దాకా అభ్యర్థులు నామినేషన్లు దాఖలు చేయొచ్చు. అయితే, తెలంగాణ ఎన్నికల షెడ్యూల్ విడుదలకు ముందు.. ఒక్క అధికారపార్టీ బీఆర్ఎస్ మాత్రమే అభ్యర్థులను ప్రకటించింది.. బీఆర్ఎస్ అధినేత ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్ రావు త్వరలోనే అభ్యర్థులకు బీ ఫాంలను అందించనున్నారు. విపక్ష పార్టీలు కాంగ్రెస్, బీజేపీ త్వరలోనే టికెట్లను ప్రకటించనుంది. మొత్తం మీద.. నామినేషన్ల దాఖలుకు దాదాపు నెల సమయం ఉంది. అయితే, ఇప్పటికే టికేట్ డిసైడ్ అయిన అభ్యర్థులు.. టికెట్ వస్తుందని ఊహగానాల్లో ఉన్న పలు పార్టీల ఆశావహులు.. ఏ రోజున నామినేషన్‌ వేయాలి, ఏ రోజు ముహూర్తం బాగుంది..? అనే విషయాలు తెలుసుకోవడానికి పండితుల చుట్టూ ప్రదక్షిణలు చేస్తున్నట్లు సమాచారం..

అయితే, నామినేషన్లు వేయడానికి ఆ నాలుగు రోజులను మించి ముహుర్తం లేదట. దీంతో నేతలు ఆ నాలుగు రోజుల్లోనే నామినేషన్‌ వేయడానికి రెడీ అవుతున్నారుట. నామినేషన్లకు నవంబర్‌ 3, 4, 8, 9 తేదీలు బాగున్నాయని పండితులు చెబుతున్నారు. ఆ 4 రోజుల్లో తిథి, నక్షత్ర బలం అదుర్స్ అని చెబుతున్నారు. దీంతో ఆయా రోజుల్లో ఏ టైమ్‌కి నామినేషన్‌ వేయాలి అనే విషయంపై పండితులను సంప్రదిస్తున్నారు నేతలు. ఆ 4 రోజుల్లోనే మ్యాగ్జిమమ్‌ నామినేషన్లు దాఖలవుతాయని భావిస్తున్నారు.

ANN TOP 10