AMMA
NEWS
NETWORK

మా ఈ పేపర్ చదవండి :  

షర్మిల అరెస్ట్.. పరిస్థితి ఉద్రిక్తం

వైఎస్సార్‌టీపీ అధ్యక్షురాలు వైఎస్‌ షర్మిల మరోసారి అరెస్ట్‌ అయ్యారు. మహిళా దినోత్సవం సందర్బంగా మహిళల సమస్యలపై షర్మిల హైదరాబాద్‌ ట్యాంక్‌ బండ్‌ వద్ద దీక్షకు దిగారు. ఈరోజు సాయంత్రం వరకు దీక్ష చేయాలని షర్మిల నిర్ణయించుకున్నారు. షర్మిల దీక్షతో ట్యాంక్‌ బండ్‌ ప్రాంతంలో భారీగా ట్రాఫిక్‌ జామ్‌ నెలకొంది. శాంతిభద్రతల దృష్యా షర్మిల చేపట్టిన దీక్షకు అనుమతి లేదని..తెలిపిన పోలీసులు ఆమెను అరెస్ట్‌ చేశారు. దీనితో అక్కడ ఉద్రిక్త పరిస్థితులు నెలకొనడంతో భారీగా పోలీసులు మోహరించారు. షర్మిలను అరెస్ట్‌ చేసిన పోలీసులు బొల్లారం స్టేషన్‌ కు తరలించారు.

ఇక అంతకుముందు షర్మిల ట్యాంక్‌ బండ్‌ వద్ద ఉన్న చాకలి ఐలమ్మ, రాణి రుద్రమదేవి విగ్రహాలకు పూలమాలవేసి నివాళులు అర్పించారు. అనంతరం ఆమె మాట్లాడుతూ బీఆర్‌ఎస్‌ పై తీవ్ర విమర్శలు చేశారు. తెలంగాణలో మహిళలకు కనీస భద్రత లేదు. రాష్ట్రంలో మద్యానికి ఉన్న భద్రత మహిళలకు లేదని ఆరోపించారు. అత్యాచారాలు, కిడ్నాప్‌ లలో రాష్ట్రం నెంబర్‌ వన్‌ గా నిలిచింది. కానీ మహిళల విషయంలో కేసీఆర్‌ ప్రభుత్వం పచ్చి అబద్దాలు ఆడుతుందుని షర్మిల విమర్శించారు.

ANN TOP 10