ప్రజాసేవే పరమావధిగా నిరంతరం పనిచేస్తున్న ప్రజానాయకుడు, బీజేపీ రాష్ట్ర నేత కంది శ్రీనివాసరెడ్డి ఇంట ఆత్మీయ సందడి నెలకొంది. ఆదివారం ఆదిలాబాద్‌లోని గాయత్రి గార్డెన్‌లో కంది శ్రీనివాస రెడ్డి, కంది మౌన దంపతుల పుత్రిక, గారాలపట్టి చిన్నారి అరిక కేశఖండన వేడుక ఆధ్యంతం అత్యంత వైభవంగా జరిగింది. పలు గ్రామాల నుంచి అభిమానులు, ప్రజలు, పార్టీ నాయకులు, కార్యకర్తలు వేలాదిగా తరలివచ్చారు. ఆహూతులతో గార్డెన్ శోభాయమానంగా మారింది. విచ్చేసిన శ్రేయోభిలాషులు, ఆత్మీయులు, పార్టీ నాయకులు, కార్యకర్తలకు కంది శ్రీనివాసరెడ్డి సాదర స్వాగతం పలికారు. ఈ సందర్భంగా పలువురు మాట్లాడుతూ నిరంతరం ప్రజలతో మమేకమవుతూ ప్రజా సమస్యల పరిష్కారానికి విశేష కృషి చేస్తున్నారని అన్నారు. నేటి తరానికి స్ఫూర్తి దాయకంగా నిలుస్తున్నారని కొనియాడారు.