మంచు మనోజ్ రెండో వివాహానికి సిద్ధమవుతున్నారు. గత కొంతకాలంగా మనోజ్ భూమా మౌనికతో రిలేషన్ లో ఉన్నాడు. గతంలో గణేష్ ఉత్సవాల సందర్భంగా కూడా వీరిద్దరూ జంటగా కనిపించారు. అప్పటి నుంచి వీరిద్దరి రిలేషన్ అఫీషియల్ గా వైరల్ అవుతోంది. అయితే త్వరలో మంచు మనోజ్, భూమా మౌనిక తమ రిలేషన్ ని నెక్స్ట్ లెవల్ కి తీసుకువెళ్లనున్నట్లు తెలుస్తోంది. వీరిద్దరి వివాహానికి ముహూర్తం ఫిక్స్ అయ్యిందట. మార్చి 3న భూమా మౌనిక, మనోజ్ ల వివాహం జరగనున్నట్లు తెలుస్తోంది. ఆల్రెడీ పెళ్ళికి సంబందించిన ఏర్పాట్లు జరుగుతున్నాయట. మంచు మనోజ్ సోదరి మంచు లక్ష్మి పెళ్లి ఏర్పాట్లని దగ్గరుండి చూసుకుంటున్నారట. మంచు మనోజ్ కి, భూమా మౌనికకి చాలా కాలం క్రితమే పరిచయం ఉంది. భూమా అఖిల ప్రియ, భూమా మౌనిక తమ తల్లిందండ్రుల రాజకీయ వారసత్వాన్ని కొనసాగిస్తున్నారు. భూమా మౌనిక తల్లిదండ్రులు భూమా నాగిరెడ్డి, శోభా నాగిరెడ్డి ఇద్దరూ కొన్నేళ్ల క్రితం మరణించారు. మంచు మనోజ్ ఇటీవలే తన కొత్త చిత్రాన్ని ప్రకటించారు. తిరిగి నటుడిగా యాక్టివ్ అయ్యేందుకు మనోజ్ ప్రయత్నిస్తున్నారు.