AMMA
NEWS
NETWORK

మా ఈ పేపర్ చదవండి :  

అలాంటి లవర్‌ కావాలి..

మనసులో మాట బయటపెట్టిన అషు రెడ్డి
కొన్ని రోజులుగా బిగ్‌ బాస్‌ బ్యూటీ అషు రెడ్డి అందాల తడితో సోషల్‌ మీడియా వేడెక్కిపోతోంది. ఎప్పటికప్పుడు ఫ్రెష్‌ అందాలతో మాయ చేస్తోంది ఈ ముద్దుగుమ్మ. తాజా తన మనసులో మాట బయటపెట్టింది అషు రెడ్డి. ఆగ్రాలోని తాజ్‌ మహల్‌ వద్దకు వెళ్లిన బిగ్‌ బాస్‌ బ్యూటీ అషు రెడ్డి అక్కడ ఫ్లైయింగ్‌ కిస్సులిస్తూ నానా హంగామా చేసింది.

ఆ ఫోటోలను తన సోషల్‌ మీడియా ఖాతాలో పోస్ట్‌ చేస్తూ అది కట్టించిన షాజహాన్‌ ని ఓ కోరిక కోరుకుంది. ముంతాజ్‌ ప్రేమకు గుర్తుగా షాజహాన్‌ తాజ్‌ మహల్‌ కట్టించారు. అయితే నీ ప్రేమించే వ్యక్తి నాకు కూడా కావాలంటోంది అషు రెడ్డి. హే షాజహాన్‌.. నీలాగే ప్రేమించే వ్యక్తి లవర్‌ గా రావాలని ఆశీర్వదించండి అంటూ ట్యాగ్‌ చేసింది. దీంతో ఈ పోస్ట్‌ వైరల్‌ అవుతోంది.

ANN TOP 10