ప్రాణం పోసిన కానిస్టేబుల్
రంగారెడ్డి: జిల్లాలోని రాజేంద్రనగర్ సర్కిల్ ఆరంఘార్ చౌరస్తా బస్‌స్టాప్‌లో ఓ యువకుడు ఒక్కసారిగా కుప్పకూలిపోయాడు. అక్కడే విధులు నిర్వహిస్తున్న ట్రాఫిక్ కానిస్టేబుల్ రాజశేఖర్ హుటాహుటిన యువకుడి దగ్గరు పరుగులు తీశారు. యువకుడి గుండె కొట్టుకోవడం ఆగినట్టు గుర్తించిన కానిస్టేబుల్ ఎంతో సమయస్పూర్తితో సీఆర్పీ చేశారు. కానిస్టేబుల్ అప్రమత్తతో యువకుడి ప్రాణం నిలిచింది. సీఆర్పీ చేసిన వెంటనే యువకుడు తిరిగి ఊపిరి తీసుకున్నాడు. వెంటనే అతడిని స్థానిక ఆస్పత్రికి తరలించారు. సీఆర్పీ చేసి యువకుడి ప్రాణాలు కాపాడిన కానిస్టుబుల్.. అతడికి పునర్జన్మను ప్రసాదించినవాడయ్యాడు. ప్రస్తుతం యువకుడి ఆరోగ్యం నిలకడగా ఉన్నట్లు వైద్యులు తెలిపారు. కాగా యువకుడు పడిపోయిన వెంటనే ఎంతో సమయస్పూర్తితో సీఆర్పీ చేసి ప్రాణాలు నిలబెట్టిన కానిస్టేబుల్ పట్ల ప్రశంసలు వెల్లువెత్తున్నాయి.
వ్యాయామం చేస్తూ…
రాజేంద్రనగర్‌లో కానిస్టేబుల్ అప్రమత్తతో యువకుడి ప్రాణాలు నిలువగా.. అటు ఆసీఫ్‌నగర్‌లో ఓ కానిస్టేబుల్ వ్యాయామం చేస్తూ ప్రాణాలు కోల్పోయాడు. హార్ట్ అటాక్‌తో విశాల్ (24) అనే కానిస్టేబుల్ మృతి చెందాడు. అతి చిన్న వయసులో పైగా జిమ్‌లో వ్యాయామం చేస్తూ ఉన్నట్టుండి కుప్పకూలిపోయాడు. విశాల్ 2020 బ్యాచ్‌కు చెందిన కానిస్టేబుల్. 2023లో ఉద్యోగాన్ని సంపాదించి ఆసీఫ్ నగర్ పోలీస్ స్టేష¯Œ లో విధులు నిర్వహిస్తున్నాడు. విశాల్ బోయిన్ పల్లిలో నివాసముంటున్నాడు. గురువారం సాయంత్రం సికింద్రాబాద్‌లోని ఓ జిమ్‌లో వ్యాయమం చేస్తుండగా గుండె నొప్పితో కుప్పకూలిపోయి మరణించాడు. చూస్తుండగానే సెకన్ల వ్యవధిలో అంతా జరిగిపోయింది.