AMMA
NEWS
NETWORK

మా ఈ పేపర్ చదవండి :  

మరికొన్ని గంటల్లో ఓటీటీలోకి ‘వీరసింహారెడ్డి’

సంక్రాంత్రి సందడిగా విడుదలైన వీరసింహారెడ్డి థియేటర్​లో చేసిన రచ్చ మామూలుగా లేదు. వరల్డ్ వైడ్​గా ఈ సినిమా దుమ్ము లేపింది. కలెక్షన్లలోనూ సునామీ సృష్టించింది. గోపిచంద్ మలినేని దర్శకత్వంలో నందమూరి బాలకృష్ణ కథానాయకుడిగా నటించిన ఈ సినిమా థియేటర్లలో పూనకాలు తెప్పించింది. శ్రుతి హాసన్ బాలయ్య సరసన ఈ సినిమాలో జతకట్టింది. గ్రాండ్​గా రిలీజ్​ అయి సూపర్ హిట్ అయిన ఈ సినిమా ఎప్పుడెప్పుడు ఓటీటీలోకి వస్తుందా.. ఎప్పుడెప్పుడు మళ్లీ చూద్దామా అని బాలయ్య ఫ్యాన్స్ తెగ వెయిట్ చేస్తున్నారు.
అయితే ఆ సమయం రానే వచ్చింది. మరికొన్ని గంటల్లో వీరసింహారెడ్డి ఓటీటీలో రచ్చ చేయనుంది. ఇవాళ సాయంత్రం నుంచి డిస్నీ ప్లస్ హాట్​స్టార్​లో వీరసింహారెడ్డి స్ట్రీమింగ్ కానుంది. ఈ క్రమంలో బాలకృష్ణ ఫ్యాన్స్ కోసం డిస్నీ ప్లస్ హాట్​స్టార్ ఓ టీజర్​ను కూడా రిలీజ్ చేసింది. ఇందులో.. బ్యాకెండ్​లో ఓ ర్యాప్ సాంగ్‌ కూడా ప్లే అవుతూ ఉండడం విశేషం. “కిందా మీదా ఊపు.. బాలయ్య బాబు తోపు” అంటూ సాగుతున్న ఈ టీజర్ సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.
Facebook
Twitter 
WhatsApp
Telegram
Email  

ANN TOP 10