బీజేపీ రాష్ట్ర నాయకుడు కంది శ్రీనివాసరెడ్డి
ఆదిలాబాద్: బాజీరావు బాబా బోధనలు అందరికీ స్ఫూర్తిదాయకమని బీజేపీ రాష్ట్రనాయకుడు కంది శ్రీనివాసరెడ్డి అన్నారు. సోమవారం ఆయన
బేల మండలం కంగార్పూర్ గ్రామంలో బాజీరావు బాబా సప్తాహ వేడుకలకు హాజరయ్యారు.‡ ఈ·సందర్భంగా·ఆయనకు·గ్రామస్తులు,భక్తులు ఘనస్వాగతంపలికారు. అనంతరం ఆయన బాజీరావు భక్తులతో కలిసి భజనలు చేశారు. పల్లకి ఊరేగింపు కార్యక్రమంలో పాల్గొన్నారు. బాజీరావు బాబా బోధనలు స్ఫూర్తిదాయకమని, ప్రతిఒక్కరూ భక్తి మార్గాన్ని అలవర్చుకోవాలని సూచించారు. ముఖ్యంగా యువత చెడు వ్యసనాలకు దూరంగా ఉండాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో ఓబీసీ రాష్ట్ర కార్యవర్గ సభ్యుడు నాగర్కర్ శంకర్, పుండ్రు రవికిరణ్ రెడ్డి, సంతోష్ రెడ్డి, కిష్టా రెడ్డి, సంజీవ్, దేవిదాస్ ,బాజీరావు బాబాభక్తులు పాల్గొన్నారు.