AMMA
NEWS
NETWORK

మా ఈ పేపర్ చదవండి :  

అత్తారింటి వేధింపులు తాళలేక అల్లుడు ఆత్మహత్య..!

కట్టుకున్న భార్య, అత్తామామల వేధింపులతో ఓ భర్త ఆత్మహత్యకు పాల్పడ్డాడు. నగరంలోని కుషాయిగూడ ఎస్‌ఐ షేక్‌షఫీ తెలిపిన కథనం ప్రకారం.. కుషాయిగూడలోని పోచమ్మగుడి వద్ద మొలుగు వెంకట్‌రెడ్డి (38) తల్లి, భార్య కల్యాణి, ఇద్దరు కుమార్తెలతో కలిసి జీవనం సాగిస్తున్నాడు. ప్రైవేటుఉద్యోగి అయిన వెంకట్‌రెడ్డితో కలిసి అతని తల్లి ఉండటం అతని భార్య, అత్తమామలకు ఇష్టం లేదు. దీంతో వేరే కాపురం పెడదామని వారు నిత్యం వేధించసాగారు. దీంతో దంపతులమధ్య మనస్పర్థలు తలెత్తడంతో భార్య అలిగి పిల్లలను తీసుకుని రెండునెలల క్రితం వరంగల్‌లో పుట్టింటికి వెళ్లింది.

ఈ క్రమంలో జులై 2న తల్లిదండ్రులను తీసుకుని కల్యాణి భర్త ఇంటికి నానా హంగామా చేసింది. అత్తను వెంటనే ఇంటి నుంచి పంపించేయాలని పట్టుబట్టింది. పైగా ఆస్తి అంతటిని పిల్లల పేరున రాయాలని ఒత్తిడి చేసింది. పరువు పోతుందని ఎంతచెప్పినా కల్యాణి వినలేదు. డ్రామాలాడకు నువ్వు చచ్చేవాడివేనా అంటూ హేళన చేశారు. దీంతో తీవ్ర మనస్తాపం చెందిన వెంకట్‌రెడ్డి అదేరోజు పురుగుల మందు తాగి ఆత్మహత్యకు పాల్పడ్డాడు. అతని తల్లి గమనించి వెంటనే ఆసుపత్రికి తరలించగా చికిత్స పొందుతూ బుధవారం మృతి చెందాడు. ఈ ఘటనపై సమాచారం అందుకున్న పోలీసులు కేసు నమోదుచేసుకుని మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం తరలించినట్లు కుషాయిగూడ ఎస్‌ఐ షేక్‌షఫీ తెలిపాడు.

ANN TOP 10