AMMA
NEWS
NETWORK

మా ఈ పేపర్ చదవండి :  

డేంజర్ బెల్స్.. 2050 నాటికి 130 కోట్ల మందికి షుగర్!

మనం తినే ఆహారం.. మనకు ఉన్న అలవాట్లతో.. రాబోయే కాలంలో మరిన్ని ముప్పులు ముంచుకురానున్నట్లు తెలుస్తోంది. ప్రపంచవ్యాప్తంగా షూగర్ ముప్పు రోజు రోజుకు పెరిగిపోతుంది. 2050 నాటికి ప్రపంచ జనాభాలో 13.4 శాతం అంటే దాదాపుగా 130 కోట్ల మందికి డయాబెటిస్ వ్యాధి ఉంటుందని ది లాన్సెట్ పరిశోధనలో తేలింది. ఇది ప్రస్తుతం 2021లో ఉన్న 52.9 కోట్ల కంటే రెట్టింపు కావడంతో… రాబోయే 30 ఏళ్లలో ఏ దేశంలో కూడా వయస్సు-ప్రామాణిక మధుమేహం రేట్స్ తగ్గుముఖం పట్టదని ది లాన్సెట్ అధ్యయనం వెల్లడించింది.

అవగాహన మధుమేహాన్ని అణిచేందుకు ప్రయత్నాలు జరగుతున్నప్పటికీ వ్యాప్తి చెందుతూనే వస్తోంది. ప్రపంచ వ్యాప్తంగా ఇతర వ్యాధుల్ని షుగర్ వ్యాధి అధిగమిస్తుందని వైద్యులు చెబుతున్నారు. తక్కువ మధ్య ఆదాయ దేశాల్లో కూడా మధుమేహ వ్యాధి అనారోగ్యం మరణాల రేట్లు పెరుగుతున్నాయని అధ్యయనం వెల్లడించింది.

2045 నాటికి మధుమేహం ఉన్నవారిలో మూడొంతుల మంది తక్కువ మధ్య ఆదాయ దేశాల్లో నివసిస్తారని అంచనా వేసింది. వీరిలో 10 మందిలో ఒకరు మాత్రమే మధుమేహ సంరక్షణను అందుకుంటారని పేర్కొంది.

పరిశోధకులు చెబుతున్నదాని ప్రకారం.. కరోనా తర్వాత ప్రపంచ వ్యాప్తంగా డయాబెటిస్ అసమానతలను పెంచింది. డయాబెటిక్ అనేది ప్రస్తుత కాలంలో అతిపెద్ద ప్రజారోగ్య ముప్పులో ఒకటని.. రాబోయే మూడు దశాబ్ధాల్లో ప్రతీ దేశంలో వయసు లింగం వర్గం అనే భేదం లేకుండా దూకుడుగా అభివృద్ధి చెందుతుందని ఇది ప్రపంచవ్యాప్తంగా ఆరోగ్య సంరక్షణ వ్యవస్థలకి తీవ్రమైన సవాల్ గా నిలుస్తుందని పరిశోధకులు తెలిపారు.

Facebook
Twitter 
WhatsApp
Telegram
Email  

ANN TOP 10