కర్నూల్ విశ్వభారతి ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న కడప ఎంపీ అవినాష్ రెడ్డి (Ys Avinash Reddy) తల్లి శ్రీలక్ష్మిని వివేకా సోదరి విమలారెడ్డి బుధవారం పరామర్శించారు. ఈ క్రమంలో అవినాష్ రెడ్డికి విమలారెడ్డి దైర్యం చెప్పారు. అనంతరం వైఎస్ వివేకా హత్యపై విమలారెడ్డి సెన్సేషనల్ కామెంట్స్ చేశారు.
వివేకాను హత్య చేసిన వారు బయట తిరుగుతున్నారన్న ఆమె..తప్పు చేయని వారిని జైల్లో పెడుతున్నారన్నారు. అవినాష్ రెడ్డి (Ys Avinash Reddy)ని టార్గెట్ చేసి వేధిస్తున్నారని విమలారెడ్డి అన్నారు. తన కుటుంబం ఎవరినీ హత్య చేయలేదని మొదట సునీత చెప్పారు. కానీ ఆ తర్వాత సునీత మాట మార్చారు. తప్పు అని చెప్పినందుకే సునీత మాతో మాట్లాడడం లేదని విమలారెడ్డి వ్యాఖ్యానించారు. అవినాష్ (Ys Avinash Reddy) తప్పు చేయలేదని అనిపిస్తుందని.. దుష్టశక్తులు వెంబడిస్తున్నట్లు అనిపిస్తుందని అన్నారు.